గాలివాన బీభత్సం.. | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం..

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

నేలవాలిన వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు

పలు చోట్ల దెబ్బతిన్న ఇళ్లు,

లేచిపోయిన రేకులు

డిచ్‌పల్లి (మోపాల్‌)/ధర్పల్లి/ నిజామాబాద్‌ రూరల్‌ : ధర్పల్లి మండలంలో, మోపాల్‌ మండలంలోని మంచిప్ప, భైరాపూర్‌ గ్రామాల్లో మంగళవారం సా యంత్రం వర్షం, భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గ్రామాల్లోని భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. రెండు గ్రామాల్లో కలిపి దాదాపు 15 ఇళ్లు కూలిపోగా, పలుచోట్ల పైకప్పు రేకులు గాలిలో లేచి పడ్డాయి. 50 పైగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మంచిప్ప, భైరాపూర్‌లో 11కేవీ లైన్‌ తీగలు పడిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. భారీగా వీచిన ఈదురు గాలులకు రేకులు లేచిపోవ డంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వారికి ప్రభుత్వ భవనాలు, బంధువులు ఇళ్లలో సర్పంచులు కెతావత్‌ శాంత వసంత్‌, తూర్పు రాజమణి, అధికారులు పునరావాసం కల్పించారు. అక్కడ క్కడా స్వల్పంగా కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసింది.

అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే..

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు బయల్దేరిన ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి విషయం తెలిసిన వెంటనే విద్యుత్‌, రెవెన్యూ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. మంచిప్ప సర్పంచ్‌ గంగామణిరాజేశ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్తులు ఆందోళన చెందొద్దని, నష్టపోయిన వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement