● ఉప్పాల సీనమ్మ, లక్ష్మయ్య దంపతులు
నెల్లూరు జిల్లా ఎడవలూరు మండలం ఊటుకురుకు చెందిన ఉప్పాల సీనమ్మ, లక్ష్మయ్య దంపతులు మాట్లాడుతూ ఇలా చెప్పారు. మేము రూ. 60 వేల అడ్వాన్సు తీసుకుని తిరుపతి రెడ్డికి చెందిన ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నాము. మేము ఎక్కడికి పారిపోతామోనని తిరుపతి రెడ్డి మనుషులు మా పదేళ్ల కుమారుడు శ్రీనును వారికి చెందిన దేగాం గ్రామంలో ఉన్న మరో ఇటుకల బట్టిలో పనికి పెట్టుకున్నారు. మా కుమారున్ని మా వద్దకు రానివ్వడం లేదు. మా కుమారుడిని మాకు అప్పగించండి.


