చక్కని నైపుణ్యాలు | - | Sakshi
Sakshi News home page

చక్కని నైపుణ్యాలు

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

చిట్టి చేతులు..

బీబీపేట : వేసవి సెలవులు వృథా కాకుండా విద్యార్థుల్లోని నైపుణ్యాలు, వారిలోని సృజనాత్మకతను బయటికి తీసేందుకు బీబీపేట టీఎస్‌ఎన్‌ఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల వేదిక అయింది. పాఠశాలలో అగస్థ్యా ఫౌండేషన్‌ వేసవి కాల ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా రాణి అనే టీచర్‌ను నియమించి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతోపాటు ఇతర పాఠశాలల విద్యార్థులూ తరగతులకు హాజరవుతున్నారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు పలు రంగాలలో ప్రావీణ్యం పొందుతున్నారు. విద్యార్థులకు కావాల్సిన సామగ్రి సైతం పాఠశాల తరఫున సమకూరుస్తున్నారు. పేయింటింగ్‌, డ్రాయింగ్‌, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, కంప్యూటర్‌, చెస్‌, క్యారం, డిజైనింగ్‌ తదితర వాటిపై శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు వాటిపై మక్కువ పెంచుకొని టీచర్‌ చెప్పే సలహాలతో నేర్చుకుంటున్నారు. ఎండలు మండుతున్న వేళలో విద్యార్థులు ఇంటి దగ్గర ఎండలో ఆడుకుంటూ ఇబ్బందులు పడకుండా ప్రత్యేక శిబిరానికి పంపించేందుకు తల్లిదండ్రులు సైతం ఇష్టపడుతున్నారు.

శిక్షణలో పాల్గొంటున్న విద్యార్థులు

సృజనాత్మకత పెంపొందేలా

‘అగస్థ్య’ వేసవి శిక్షణ శిబిరం

బీబీపేట టీఎస్‌ఎన్‌ఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహణ

డ్రాయింగ్‌, పేయింటింగ్‌, కంప్యూటర్‌లో ప్రత్యేక కోర్సులు

Advertisement
 
Advertisement
Advertisement