వేర్వేరు కారణాలతో ఇద్దరు రైతుల ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు కారణాలతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

ఎల్లారెడ్డి: అనారోగ్య కారణాలతో మనస్థాపానికి గురైన వృద్ధుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వెంకటాపూర్‌ అగ్రహారం గ్రామానికి చెందిన రైతు ఏముల చిన్న లింగయ్య (71) కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని పస్క పోచమ్మ ఆలయ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

పురుగుల మందు సేవించి..

నవీపేట : మండలంలోని బినోల గ్రామానికి చెందిన పాతర్ల నవీన్‌ (28) అనే యువ రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్‌ మంగళవారం తెలిపారు. బినోల శివారులోని తన పొలంలో మ ధ్యాహ్న సమయంలో మద్యం సేవించిన తర్వాత తాను పురుగుల మందు తాగినట్లు సోదరుడు శ్రీధర్‌కు నవీన్‌ ఫోన్‌ లో సమాచారమిచ్చాడు. హుటాహుటిన నవీన్‌ వద్దకు వెళ్లిన శ్రీధర్‌ అపస్మారకస్థితిలో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సాయంత్రం మృతి చెందాడు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి కుమారుడు వర్షిత్‌(4), కూతురు పురక్షిత(3) ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement