వేర్వేరు చోట్ల గుర్తుతెలియని మృతదేహాలు.. | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల గుర్తుతెలియని మృతదేహాలు..

May 20 2026 10:19 AM | Updated on May 20 2026 10:19 AM

రైల్వే ప్లాట్‌ఫామ్‌పై..

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలోని గుండ్ల చెరువు పక్కన ఉన్న గుట్ట ప్రాంతంలోని ఖాళీ స్థలంలో గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ మంగళవారం తెలిపారు. స్థా నికులు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలాన్ని ప రిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ లో భద్రపరిచామన్నారు. మృతి వయస్సు 40 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై బూడిద కలర్‌ చొక్కా, నీలం రంగుప్యాంటు, జాజు కలర్‌ బూట్లు ఉన్నాయని వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

కామారెడ్డి క్రైం: పట్టణంలోని రైల్వే ప్లాట్‌ఫామ్‌ సి మెంట్‌ బల్లపై పడుకున్న గుర్తుతెలియని మహిళ (యాచకురాలు) అక్కడే మృతి చెందింది. మృతదే హం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, మృతురాలి వయస్సు 25 నుంచి 30 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై నీలి రంగు పంజాబీ డ్రెస్‌ ఒంటిపై ఉందని రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నామన్నా రు. మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి మా ర్చురీకి తరలించామని, మృతురాలి వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.

రాంచంద్రాపల్లి శివారులో..

మాక్లూర్‌: మండలంలోని రాంచంద్రాపల్లి శివారులో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై రాజశేఖర్‌ మంగళవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 60 ఏళ్లు ఉంటుందని, మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతుడి సంబంధీకులు ఉంటే 87126 59846, 87126 59731 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement