భారమవుతున్న బస్తా | - | Sakshi
Sakshi News home page

భారమవుతున్న బస్తా

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం రైస్‌ మిల్లుల్లో దించుకునే వరకు గ్యారంటీ లేకుండా పోయింది. డొంకేశ్వర్‌ మండలంలోని దత్తాపూర్‌ గ్రామంలో మూడు రోజుల క్రితం బస్తాలను తూకం వేశారు. అదే రోజు 1,200లకు పైగా బస్తాలను రెండు లారీల్లో నింపారు. ధాన్యం లోడ్‌ ఏ రైస్‌ మిల్లుకు వెళ్లాలో కూడా అలాట్‌మెంట్‌ ఇచ్చిన సొసైటీ సిబ్బంది రైతుల నుంచి మొబైల్‌ ఓటీపీ సైతం తీసుకున్నారు. ఎందుకో తెలీదు కాని ధాన్యాన్ని దించుకోలేమని మిల్లర్లు చెప్పడంతో డ్రైవర్లు లోడ్‌ చేసుకున్న లారీలను దత్తాపూర్‌లోనే రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. మూడు రోజులుగా లారీలు అలాగే ఉండడంతో ఏం జరిగిందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండల కు ధాన్యం బరువు తగ్గే అవకాశం ఉందని, ఒకవేళ వర్షం కురిస్తే బస్తాలు తడిస్తే మిల్లర్లు తరుగు తీస్తార ని ఆందోళనకు గురవుతున్నారు.

ఈ విషయంమై కుద్వాన్‌పూర్‌ సొసైటీ సీఈవో చిన్నయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా.. వేరే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆదివారం నుంచి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం నిలిచిపోయింది.

మిల్లర్లు వద్దనడంతో..

దత్తాపూర్‌లో మూడు రోజులుగా

నిలిచిన తూకం

Advertisement
 
Advertisement
Advertisement