పరీక్ష ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదు. అలా అనుకోవడం పొరపాటు. మళ్లీ పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించవచ్చు. క్షణికావేశంలో తీసుసుకున్న నిర్ణయాలు జీవితాంతం బాధ కలిగిస్తాయి. విజయానికి చాలా మార్గాలున్నాయి. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, టైమ్ తీసుకుని మళ్లీ ప్రయత్నించండి. తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. జీవితం అమూల్యం. పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా తల్లిదండ్రుల అభయం పిల్లలకు చాలా అవసరం. – ఇజాప రమేశ్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, మోటివేటర్


