కాంగ్రెస్‌లో లొల్లి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో లొల్లి

Apr 9 2026 8:17 AM | Updated on Apr 9 2026 8:17 AM

టీజీఆర్‌జేసీ సెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌
పట్టుబడ్డ ‘మ్యూల్‌’ నెట్‌వర్క్‌

వాతావరణం

ఉదయం ఆహ్లాదకరమైన గాలులు వీస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి నిర్మలంగా ఉంటుంది.

నాణ్యమైన పరిశోధనలు..

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన పరిశోధనలు చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరి రావు న్నారు.

గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

– 8లో u

ఇంటర్‌ స్పాట్‌ను

పరిశీలించిన సీవోఈ

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ ఇంటర్‌ మూ ల్యాంకన కేంద్రాన్ని బోర్డు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ జయప్రదబాయి బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూల్యాంకన కేంద్రం పనితీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట జిల్లా ఇంటర్‌ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్‌తోపాటు మూల్యాంకన కేంద్ర అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు.

షెడ్యూల్‌ తరువాతే

ఇంటర్‌ అడ్మిషన్‌లు

ఖలీల్‌వాడి: ఇంటర్‌ బోర్డు అడ్మిషన్‌ షెడ్యూ ల్‌ విడుదల చేసిన తరువాతే ఇంటర్మీడియె ట్‌ అడ్మిషన్‌ల ప్రక్రియ ప్రారంభమవుతుందని డీఐఈవో తిరుమలపుడి రవికుమార్‌ స్పష్టం చేశారు.

జిల్లాలో కొన్ని ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు పదో తరగతి ఫలితాలు వెలువడక ముందే ఇంటర్‌ అడ్మిషన్లను చేస్తున్నట్లు త మ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇంటర్‌ బోర్డు ద్వారా కళాశాలల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తల్లదండ్రులకు సూచించారు.

13న పీఎం

అప్రెంటీస్‌షిప్‌ మేళా

ఖలీల్‌వాడి: నగరంలోని బాలుర ఐటీఐలో ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు ప్రధానమంత్రి అప్రెంటిస్‌ షిప్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ యాదగిరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఐటీఐల్లో వివిధ కోర్సులు పూర్తి చేసి 18 సంవత్సరాలు నిండిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎస్సెస్సీ, ఐటీఐ సర్టిఫికెట్లతోపాటు ఆధార్‌, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో హాజరుకావాలని, వివరాలకు 9948195654 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

బోధన్‌: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీఆర్‌జేసీ సెట్‌–2026కు పదోతరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థుల నుంచి దరఖాస్తు లను ఆహ్వానిస్తున్నట్లు టీజీఆర్‌జేసీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌, ఎడపల్లి గురుకుల బాలికల పాఠశాల/కళాశాలల ప్రిన్సిపల్‌ గంగాశంకర్‌ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు బాలికలు, రెండు బాలుర టీజీఆర్‌జేసీలు, 6 కస్తూర్బాగాంధీ బాలికల గురుకులాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నిజామాబాద్‌అర్బన్‌: నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంకు ఖాతాలు (మ్యూల్‌ అకౌంట్స్‌) తెరుస్తున్న నెట్‌వర్క్‌ను నాలుగోటౌన్‌ పోలీసులు ఛేదించారు. నెల రోజుల క్రితం ఇదే కేసులో ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో తొమ్మిది మంది నిందితులను అరెస్టు రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని కర్ణాటక బ్యాంకులో నిందితులు తప్పుడు ధ్రువపత్రాలు ఉపయోగించి కరెంటు అకౌంట్లు తెరిచారు. వాటిని మధ్యవర్తుల ద్వారా సైబర్‌మోసగాళ్లకు విక్రయించారు. అకౌంట్ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు మూడు నెలల వ్యవధిలోనే సుమారు రూ.152 కోట్ల మేర లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు అర్సపల్లికి చెందిన మహమ్మద్‌ జమీల్‌ అహ్మద్‌, ఎడపల్లికి చెందిన షేక్‌ సోయా, నిజామాబాద్‌కు చెందిన మహమ్మద్‌ సమీర్‌, షేక్‌ అహ్మద్‌, షేక్‌ రహీం, రహీం అలీ, బోధన్‌కు చెందిన భానుప్రసాద్‌, మహమ్మద్‌ అర్బాజ్‌, వీరేశం, అబ్దుల్‌ వాసిన్‌, షేక్‌ సమీర్‌, రెంజల్‌కు చెందిన షేక్‌ ఇఫ్తేకర్‌, సభావత్‌ అశోక్‌లను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. కస్టమర్‌ ఇచ్చిన ధ్రువపత్రాలను సరిగ్గా విచారించకుండా ఖాతాలు తెరిచిన బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేసినట్లు నాల్గో టౌన్‌ ఎస్‌హెచ్‌వో సతీశ్‌ తెలిపారు. కేసును ఛేదించిన ఎస్‌హెచ్‌వో సతీశ్‌ను సీపీ సాయిచైతన్య అభినందించారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే అధికార కాంగ్రెస్‌లో తాజాగా మరోసారి విభేదాలు బహిర్గతం అ య్యా యి. మాజీ డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి పుట్టినరోజు గురువారం కావడంతో ఆయన అనుచ రులైన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదభట్టు వేణురాజ్‌, పుండ్ర సాయికుమార్‌, నరేన్‌దీప్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ అంశంతో వివాదం నెలకొంది.

చివరకు కొన్న గంటల సమయంలోనే ఈ ముగ్గురు ఎన్‌ఎస్‌యూ ఐ నాయకులను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరిస్తున్న ట్లు నిజామాబాద్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ప్రకటన విడుదల చేయడం గ మనార్హం. ఈ ఘటనతో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు రానురాను మరిన్ని బయటపడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

పీసీసీ అధ్యక్షుడి వద్దకు చేరిన సస్పెన్షన్‌

పంచాయితీ..

సస్పెన్షన్‌ ప్రకటన విడుదల చేసిన వెంటనే వేణురాజ్‌ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ వద్దకు తీసుకెళ్లారు. గతంలో మానాల మోహన్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ పార్టీ నాయకులకు సంబంధించిన పుట్టిన రోజుల సమయంలో కేక్‌లు కట్‌ చేసినట్లు వేణురాజ్‌ పీసీసీ అధ్యక్షుడికి తెలిపాడు. ఏడేళ్ల పాటు డీసీసీ అధ్యక్షుడిగా సేవలు అందించిన మానాల పుట్టిన రోజున కేక్‌ కట్‌ చేయవద్దనడం ఏమిటని వేణురాజ్‌ అంటున్నా డు. గతంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సమయంలోనూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనను వేదిక వద్దకు రాకుండా చేసేందుకు చివరి నిముషంలో జాబితా నుంచి పేరును తీసేసినట్లు వేణురాజ్‌ ఆరోపణలు చేస్తున్నాడు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన తన పట్ల ఇలా వ్యవహరించడం ఏమిటని అంటున్నాడు. షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా, సంజాయిషీ తీసుకోకుండా, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకత్వం అనుమతి లేకుండా ఏకపక్షంగా సస్పెండ్‌ చేయడమేమిటని, ఈ సస్పెన్షన్‌ చెల్లదని వేణురాజ్‌ చెబుతున్నాడు.

ధర్పల్లి: మండల కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అసహనం వ్యక్తం చేశారు. పనులను వేగవంతంగా చేపట్టి సెప్టెంబర్‌ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ధర్పల్లిలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను వంద పడకల ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసి నూతన భవన నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం రూ.33.15 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. భవన నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పనుల్లో నాణ్యత, పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలు తెలుసుకున్నారు. నాణ్యతను పాటిస్తూ భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ఆస్పత్రిలో అన్ని వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్య వైఖరిని వీడాలని, పనితీరులో మార్పు కనిపించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక కొరత వంటి సాకులు చెప్పొద్దని, టీజీఎండీసీ ద్వారా అనుమతులు తీసుకొని నిర్మాణాలకు సరిపడా ఇసుక నిల్వలను సమకూర్చుకోవాలని సూచించారు. ఉదయం వేళలో ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయంలో ఇసుక వాహనాలు తిరగొద్దని స్పష్టం చేశారు. ప్రధాన రహదారి నుండి ఏరియా ఆసుపత్రి వరకు అప్రోచ్‌ రోడ్డును నిర్మించాలని సూచించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ శాంత, టీజీఏంఐడీసీ ఏఈ ప్రవీణ్‌, ఆర్‌ఐ రాజేశ్వర్‌, అధికారులు తదితరులు ఉన్నారు.

ధర్పల్లిలో ఆస్పత్రి నిర్మాణ పనుల వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

తొమ్మిది మంది అరెస్టు

నకిలీ పత్రాలతో బ్యాంకు ఖాతాలు

సైబర్‌ మోసగాళ్లకు విక్రయం

రూ.152 కోట్ల లావాదేవీలు

కాంగ్రెస్‌ నుంచి ముగ్గురి సస్పెన్షన్‌

సుభాష్‌నగర్‌: పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి వరదబట్టు వేణురాజ్‌, 48వ డివిజన్‌ మాజీ అధ్యక్షుడు పుండ్ర సాయికుమార్‌, జిల్లా నాయకులు నరేశ్‌దీప్‌ కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిజామాబాద్‌ కార్పొరేషన్‌ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ బుధవా రం ఉత్తర్వులు జారీచేశారు. కాంగ్రెస్‌ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా బుధవారం కిసాన్‌ న్యా య్‌ సత్యాగ్రహ దీక్ష జరుగుతున్న సమయంలో వ్యక్తిగత కార్యాచరణ ను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమానికి అంతరాయం కలిగించే విధంగా అక్కడున్న డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్‌రెడ్డి, కార్పొరేషన్‌ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ఇత ర నాయకులతో వాగ్వావాదానికి ది గారు. కార్పొరేషన్‌ చైర్మన్లు తాహెర్‌ బిన్‌ హందాన్‌, అన్వేష్‌రెడ్డి, పీసీసీ ప్రధానకార్యదర్శి రాంభూపాల్‌, రా ష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు జీవీ రామకృష్ణ, నగర మేయర్‌ ఉమారాణిరమేష్‌, కార్పొరేటర్లు హెచ్చరించినా.. విన్పించుకోకుండా వారు అనుకున్న కార్యక్రమాన్ని చేసి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. డీసీసీల అధ్యక్షులు, కార్పొరేషన్‌ చైర్మన్లు, రాష్ట్ర నాయకుల ఎదుట జరగడం వల్ల పైన పేర్కొన్న ముగ్గురికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ బహిష్కరించారు. ఇక నుంచి ఆ ముగ్గురితో కాంగ్రెస్‌ పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని బొబ్బిలి రామకృష్ణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మానాల మోహన్‌రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేసేందుకు వేణురాజ్‌, సాయికుమార్‌, నరేన్‌దీప్‌ డీసీసీ కార్యాలయానికి వచ్చా రు. ఈ సమయంలో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కిసాన్‌ న్యాయ్‌ సత్యాగ్రహ దీక్ష జరుగుతోంది. ఈ సమయంలో కార్యాలయంలో ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని డీసీసీ అధ్యక్షుడు కాటి పల్లి నగేష్‌రెడ్డి, కార్పొరేషన్‌ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సూచించారు. సత్యాగ్రహ దీక్ష అనంతరం కేక్‌ కట్‌ చేసే కార్యక్రమం చేపట్టడంతో నగే ష్‌రెడ్డి, రామకృష్ణ.. వేణురాజ్‌ అనుచరులకు మ ధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ గందర గోళం మధ్యలోనే కేక్‌ కట్‌ చేశారు. అనంతరం కొ న్ని గంటల వ్యవధిలోనే ఈ ముగ్గురిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటన విడుద ల చేయడం గమనార్హం. కాంగ్రెస్‌లో ఈ ముగ్గురి ప్రాథమిక సభ్య త్వం రద్దు చేస్తున్నట్లు, వీరికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటనలో పేర్కొన్నారు.

నియమాలను ఉల్లంఘించారు..

డీసీసీ కార్యాలయంలో జిల్లాలోని నాయకుల పుట్టిన రోజులు చేయొద్దని గతంలోనే నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు నియమాలను రూపొందించుకున్నాం. జాతీయ, రాష్ట్ర నాయకుల పుట్టిన రోజులు మాత్రమే చేసేందుకు నిర్ణయించాం. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు ప్రశ్నించిన నాపై, డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు అన్వేష్‌రెడ్డి, తాహెర్‌బిన్‌ హందాన్‌, మేయర్‌ ఉమారాణి, ఆరుగురు కార్పొరేటర్లతో ఇష్టం వచ్చినట్లు దురుసుగా మాట్లాడిన నేపథ్యంలోనే సస్పెండ్‌ చేశాం. ఇది ప్రతిఒక్కరికీ హెచ్చరిక. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటివారిౖపైనెనా చర్యలు తప్పవు. – బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు

సస్పెన్షన్లకు దారితీసిన పుట్టినరోజు

కేక్‌ కటింగ్‌

అధికార పార్టీలో మరోసారి

విభేదాలు బహిర్గతం

జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో

ఘటనతో మారిన పరిణామాలు

షోకాజ్‌ ఇవ్వకుండా, రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అనుమతి లేకుండా చేసిన

సస్పెన్షన్‌ చెల్లదంటున్న వేణురాజ్‌

నియమాలను ఉల్లంఘిస్తే ఎంతటి

వారిౖపైనెనా చర్యలు తప్పవు: కార్పొరేషన్‌

కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement