ప్లాస్టిక్ వినియోగం కారణంగా తలెత్తే అనర్థాలకు తమ గ్రామస్తులు బలికావొద్దని, 25 ఏళ్లలోపు యువత నిషేధిత తంబాకు ఉత్పత్తులకు, కల్లుకు దూరంగా ఉండాలని ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామం తీర్మానం చేసింది. గ్రామంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడంతోపాటు 25 ఏళ్లలోపు యువకులకు సిగరెట్లు, కల్లు, తంబాకు ఉత్పత్తులు విక్రయించొద్దని వ్యాపారులకు జీపీ పాలకవర్గం, వీడీసీ బుధవారం ఆదేశించింది. స్టీల్ గ్లాస్‌లు వినియోగించాలని హోటళ్ల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామస్తుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం మచ్చర్ల ముచ్చటైన తీర్మానం చేసిందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉప సర్పంచ్ కట్ట నర్సయ్య, మాజీ సర్పంచ్ గంజి నర్సయ్య, వీడీసీ సభ్యులు గంజి మహేందర్, పోశన్న, గంగారెడ్డి, శ్రీనివాస్, లింగమయ్య, భూమన్న, జగదీశ్, గంగారాం, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. – పెర్కిట్(ఆర్మూర్)
మచ్చర్లలో హోటల్ నిర్వాహకుడికి అవగాహన కల్పిస్తున్న వీడీసీ సభ్యులు


