నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి

Apr 9 2026 8:17 AM | Updated on Apr 9 2026 8:17 AM

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ

చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి

నూతన విత్తన చట్టంపై డీలర్లు,

సహకార సంఘాలతో సమీక్ష

సుభాష్‌నగర్‌: రైతులకు విత్తన కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యమైన విత్తనా లే సరఫరా చేయాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో విత్తన డీలర్లు, సహకార సంఘాల సీఈవోలు, ఎఫ్‌పీవోలు, ఏఆర్‌ఎస్‌కే ప్రతిని ధులతో బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన విత్తనాలను సేకరించిన తర్వా త అధునాతన ల్యాబ్‌లో పరీక్షించి, నాణ్యతను ని ర్దారించి తిరిగి రైతులకు సాగు కోసం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత సీజన్‌కు అవసరమైన సన్నరకాల్లో ప్రధానంగా బీపీటీ 5204, ఆర్‌ఎన్‌న్‌ఆర్‌ 15048, కెఎనన్‌ఎం 1638 రకాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా దొడ్డు రకాల్లో కేఎన్‌ఎం 118, ఎంటీయూ 1010 రకాలను నిల్వ ఉంచినట్లు తెలిపారు. వీటితోపాటు భూసారాన్ని పెంచే పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగ, జనుమును రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సహకార సంఘాలు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాల పనితీరుపై చైర్మన్‌ అసహనం వ్యక్తంచేశారు. లైసెన్స్‌ ఉన్న ప్రతి డీలర్‌ తప్పనిసరిగా ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను తన దుకాణంలో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారని, 1.20లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమవుతుందన్నారు. కనీసం 50వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను సర్కారు ద్వారా సరఫరా చేస్తామని తెలిపారు. సమావేశంలో డీఏఓ వీరాస్వామి, డీసీఓ శ్రీనివాస్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు, డీలర్లు, ఎఫ్‌పీఓ ప్రతినిధులు, సీఈఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement