ఆదుకుంటాం | - | Sakshi
Sakshi News home page

ఆదుకుంటాం

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

డిచ్‌పల్లి: వడగండ్లు, అకాలవర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణ చర్యల నిమిత్తం ఇప్పటికే వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్‌ శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రూరల్‌ నియోజకవర్గంలో అకాల వర్షం, వడగండ్లు, గాలివాన బీభత్సం కారణంగా ఆయా ప్రాంతాల్లో గుడిసెలు కోల్పోయిన వా రిని సైతం గుర్తించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు, నేలకొరిగిన చెట్లతొలగింపు ఇతరత్రా నష్టాలను సైతం గుర్తించి తగు చర్యలు తీసుకుంటామ ని స్పష్టం చేశారు. తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి వెంట తప్పకుండా ఉంటామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement