డిచ్‌పల్లి: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ అన్నారు. మండలంలోని బెటాలియన్ లో ఆదివారం జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కమాండెంట్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, న్యాయం, సేవాభావంతో పని చేయాలని సిబ్బందికి సూచించారు. బెటాలియన్ అధికారులు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నగరంలో..
నిజామాబాద్‌అర్బన్: నగరంలో ఆదివారం మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బరికుంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. ఈసందర్భంగా కంఠేశ్వర్ కమన్ వద్ద గల ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి డీసీపీ బస్వారెడ్డి, అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.


