క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Apr 5 2026 9:12 AM | Updated on Apr 5 2026 9:12 AM

రోడ్డు ప్రమాదంలో

ఒకరికి గాయాలు

తాడ్వాయి (ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో ఒకరికి తీవ్ర గాయా లు అయ్యా యని గ్రామస్తులు తెలిపా రు. వివరాలు ఇలా.. జగన్‌రెడ్డి అనే వ్యక్తి శనివారం తన భార్యను బైక్‌పై ఎక్కించుకొని ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి వైపు బయలుదేరాడు. తాడ్వాయి మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధిహామిలో ఇన్‌చార్జీ ఏపీవోగా పనిచేస్తున్న తిరుపతి తన కారును నడుపుతూ చేసుకుంటే చిట్యాల రోడ్డు నుంచి కార్యాలయానికి బయలుదేరాడు. తాడ్వాయిలోని ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై బైక్‌ను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళుతున్న జగన్‌రెడ్డికి తీవ్రగాయాలు కాగా భార్యకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులుఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు

కోటగిరిలో యువకుడి

ఆత్మహత్యాయత్నం

సీపీఆర్‌ చేసి, ప్రాణాలు కాపాడిన పోలీసులు

రుద్రూర్‌: కోటగిరి మండల కేంద్రంలోని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా.. కోటగిరిలోని వినాయకనగర్‌కు చెందిన పిల్లి సంజీవ్‌ (30) కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో శనివారం అతడు తన ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్‌ ఇలియాస్‌, హోంగార్డు సుధాకర్‌ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లో ఉరి తాడుకు వేలాడుతున్న సంజీవ్‌ను వెంటనే తాడు తీసివేసి కిందకు దించారు. అనంతరం అతడికి సీపీఆర్‌ నిర్వహించి ప్రాణాలు కాపాడారు. పోలీసుల అప్రమత్తతతో యువకుడి ప్రాణాలు నిలిచాయని స్థానికులు వారిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement