25ఏళ్లుగా రోడ్లపైనే తిరిగిన మానసిక వైకల్య వ్యక్తి | - | Sakshi
Sakshi News home page

25ఏళ్లుగా రోడ్లపైనే తిరిగిన మానసిక వైకల్య వ్యక్తి

Apr 5 2026 9:12 AM | Updated on Apr 5 2026 9:12 AM

25ఏళ్లుగా రోడ్లపైనే తిరిగిన మానసిక వైకల్య వ్యక్తి కోటగిరిలో వృద్ధురాలి అదృశ్యం

కలెక్టర్‌ చొరవతో కుటుంబాన్ని కలుసుకున్న వైనం

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి పట్టణంలో రోడ్ల వెంట తిరుగుతున్న మానసిక వైకల్యంగల వ్యక్తి 25 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నారు. పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి (50) మానసిక వైకల్యంతో రోడ్ల వెంబడి తిరుగుతున్న విషయం ఇటీవల కలెక్టర్‌ ఆశిష్‌సంగ్వాన్‌ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన స్పందించి జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించడంతో శనివారం అతన్ని వృద్ధాశ్రమానికి తరలించి వైద్యసేవలు, ఆహారం అందించారు. తాను జగిత్యాల జిల్లాకు చెందిన వాడినని చెప్పడంతో అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు కామారెడ్డికి రాగా, అధికారులు అతడిని అప్పగించారు. 25ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుడిని కలుసుకోవడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. కలెక్టర్‌, జిల్లా సంక్షేమాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా కలెక్టర్‌ ఆదేశం ప్రకారం మానసిక వైలక్యం వ్యక్తి వివరాలు, కుటుంబసభ్యుల వివరాలు గోప్యంగా ఉంచారు.

రుద్రూర్‌: కోటగిరి మండల కేంద్రానికి చెందిన దున్నె సుజాత (66) అనే వృద్ధురాలు అదృశ్యమైనట్టు పోలీసులు తెలిపారు. సుజాత శనివారం తెల్లవారుజామున ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, సన్నిహితుల వద్ద వెతికినప్పటికీ ఆమె ఆచూకీ భించలేదు. దీంతో సుజాత కుమారుడు ప్రవీణ్‌ పోలీసులకు ఫి ర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement