అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

అసంతృప్తి

Apr 5 2026 7:36 AM | Updated on Apr 5 2026 7:36 AM

రగులుతున్న

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తుండగా.. ఇప్ప టికీ నామినేటెడ్‌ పదవులు దక్కని ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. తమకు ఆశించినమేర న్యాయం జరగడంలేదంటూ పలువురు సీనియర్‌ నాయకులు బాహాటంగానే తమ ఆగ్రహావేశాలను వెలిబుచ్చుతున్నారు. వారంలోనే నా మినేటెడ్‌ పదవులన్నీ భర్తీ చేస్తామంటూ గత ఏడాదిన్నర కాలంగా చెబుతూ వస్తున్న పార్టీ నాయక త్వం తమను మభ్యపెడుతూ కాలం గడిపిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు నాయకులు తమ సన్నిహితుల వద్ద తీవ్రంగా బాధపడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదిగో పదవుల పందేరం అంటూ పార్టీ పలుసార్లు ప్రకటించిన సందర్భాల్లో ఆశావహులు హైదరాబాద్‌లో మకాం వేసి మరీ తమ తమ స్థాయిల్లో అనేకసార్లు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు పదవుల భర్తీ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుండడంతో నిర్వేదంలోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఇది తీవ్రమైన అసంతృప్తి వైపు మళ్లుతోంది.

● నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఇప్పటికే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో కలకలం కలిగించింది. అనేక పరిణామాల అనంతరం జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయమవుతోంది. జీవన్‌రెడ్డి ఏ పార్టీలో చేరతారనే విష యమై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా నిజామాబాద్‌ నగరం నుంచి జీవన్‌రెడ్డికి సన్నిహితమైన ధర్మపురి శ్రీనివాస్‌ కుటుంబం నుంచి మాజీ మేయర్‌ సంజయ్‌ మనసులో ఉన్న అసంతృప్తి పెల్లుబికింది. తనకు ముఖ్య నేతలు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలాయని, పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేదని సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కీలకమైన మున్నూరుకాపులకు అన్యాయం చేస్తున్నారంటూ, కాంగ్రెస్‌ పార్టీలో చెబుతున్నవిధంగా బీసీలకు ఏమాత్రం న్యాయం చేయడంలేదంటూ ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల్లోని బీసీలకు జరిగినంత న్యాయం కూడా కాంగ్రెస్‌ పార్టీలో జరగడంలేదని చెబుతుండడం గమనార్హం. తాజాగా శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదర, సోదరీమణుల పేరిట నిజామాబాద్‌ నగరంలో పలు చోట్ల జస్టిస్‌ ఫర్‌ సంజయ్‌ శ్రీనివాస్‌ అంటూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివిధ వర్గాల్లో చర్చను రేకెత్తించింది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌ వెంటే తాజాగా ధర్మపురి సంజయ్‌ ఎపిసోడ్‌ తెరమీదకు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

జిల్లా నుంచి సీనియర్‌ నాయకుడు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మార చంద్రమోహన్‌రెడ్డి తాజాగా డీసీసీ పీఠం ఆశించి విఫలమయ్యారు. చంద్రమోహన్‌రెడ్డి రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పదవి రేసులో ఉన్నారు. అదేవిధంగా మరో సీనియర్‌ నాయకుడు బా డ్సి శేఖర్‌గౌడ్‌ రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి రేసులో ఉన్నారు. ఇక మాజీ డీసీసీబీ చైర్మన్‌ కుంట రమేష్‌రెడ్డి మరోసారి ఈ పదవిని ఆశిస్తున్నారు. సహకార పదవులు సైతం నామినేటెడ్‌ పద్ధతిలో ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ మునిపల్లి సాయిరెడ్డి, పురన్‌రెడ్డి సైతం నామినేటెడ్‌ రేసులో ఉన్నారు. దివంగత పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ కుమారుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ సైతం రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఇక వెల్మ భాస్కర్‌రెడ్డి, బాస వేణుగోపాల్‌ యాదవ్‌, నరాల రత్నాకర్‌, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కాటిపల్లి నరేందర్‌రెడ్డి పదవుల రేసులో ఉన్నారు.

అధికార పార్టీపై పెల్లుబుకుతున్న నిరసనలు

జగిత్యాల జీవన్‌రెడ్డి ఎపిపోడ్‌ తరువాత నిజామాబాద్‌ నుంచి సంజయ్‌

పార్టీ హైకమాండ్‌కు చెప్పుకున్నప్పటికీ ఫలితం లేదని ఆవేదన

జిల్లాలో కీలకమైన మున్నూరుకాపులకు అన్యాయం చేస్తున్నారంటూ టాక్‌

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదర

సోదరీమణుల పేరిట జస్టిస్‌ ఫర్‌ సంజయ్‌ అంటూ నగరంలో ఫ్లెక్సీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement