ధర్మపురి సంజయ్‌కి న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధర్మపురి సంజయ్‌కి న్యాయం చేయాలి

Apr 5 2026 7:36 AM | Updated on Apr 5 2026 7:36 AM

అభిమానులు, అనుచరుల నిరాహార దీక్ష

విరమింపజేసిన కార్పొరేషన్‌ డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగర మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌కి తగిన పదవి ఇచ్చి న్యాయం చే యాలని డీఎస్‌ అభిమానులు, అనుచరులు డి మాండ్‌ చేశారు. ఈ మేరకు నగరంలోని గాంధీచౌక్‌లో శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ సంజయ్‌కి మద్దతుగా నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి డీఎస్‌ సమాధి వద్ద ధర్మ పురి సంజయ్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తున్న సంజయ్‌కి తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. దీక్షా శిబిరంలో సంజయ్‌ అభిమానులు ఆకుల చిన్న రాజేశ్వర్‌, పుప్పాల విజయ, ఆమంద్‌ వెంకటేష్‌, కపిల్‌, పుప్పాల బాజన్న, సందీప్‌, రణధీర్‌, బగ్గాలి అజయ్‌, తదితరులు కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని నిజామాబాద్‌ కార్పొరేషన్‌ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సందర్శించి సంజయ్‌ అభిమానులతో మాట్లాడారు. కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు సమ న్యాయం జరుగుతుందని, పార్టీ కోసం పని చేసిన వారికి సరైన సమయంలో గుర్తించి పదవులు ఇస్తారన్నారు. సంజయ్‌కి తగిన గుర్తింపు, న్యాయం జరిగేలా చూస్తామని రామకృష్ణ హామీనిచ్చి అభిమానుల దీక్షను చెరుకురసం ఇచ్చి విరమింపజేశారు. కాంగ్రెస్‌లో మున్నూరుకాపులకు అన్యాయం జరుగుతోందని సంజయ్‌ అభిమానులు అనుకోవవద్దని, తనకు కార్పొరేషన్‌ డీసీసీ పదవి ఇచ్చారని, అలాగే రాంభూపాల్‌ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారని గుర్తు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ ఎలాంటి పనులు చేయొద్దని, డీఎస్‌ అనుచరులుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు నడవాలని కోరారు. 2029 ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను గెలిపించుకునే విధంగా అందరం కలిసి నడుద్దామని, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట నాయకులు సాయి బసవ, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement