న్యూస్‌రీల్
డివిజన్ల సమస్యలపై ప్రస్తావన..
పన్నులను సవరించాలి..
ఎన్నికల వరకే రాజకీయాలు..
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026ఙ
– IIలో u
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరపాలక సంస్థ (ఎన్‌ఎంసీ) 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.341.71 కోట్ల బడ్జెట్ కౌన్సిల్ ఆమో దం పొందింది. శనివారం నగర పాలక సంస్థ స మావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమా రాణి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశా రు. సమావేశానికి ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, కలె క్టర్ ఇలా త్రిపాఠి, ఎన్‌ఎంసీ కమిషనర్ దిలీప్‌కుమా ర్ హాజరయ్యారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్‌తోపాటు 2025–26 సవరించిన అంచనా బడ్జెట్‌ను సమావేశంలో ప్రవేశపెట్టగా, కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2026 ఏప్రిల్ 1 నాటికి ప్రారంభ నిల్వ రూ. 94.71 కోట్లు, 2026–27 సవరణ అంచనా ఆదా యం రూ.147.63 కోట్లు కలుపుకొని మొత్తం రూ. 231.88 కోట్లు బడ్జెట్‌లో పొందుపర్చారు. ఈ సంవత్సరపు ప్రణాళిక, ప్రణాళికేతర గ్రాంట్ల ద్వారా రూ. 99.37 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచ నా వేశారు. మొత్తం అంచనా వ్యయం రూ.341.71 కోట్ల బడ్జెట్ పద్దులో పేర్కొన్నారు.
ప్రజల అవసరాలకు పెద్దపీట వేస్తూ నిధులను సమర్థవంతంగా వినియోగించి నిజామాబాద్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని నగర మేయర్ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఆస్తి పన్ను బకాయిల వసూళ్లకు అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకు సాగి లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా, జవాబుదారీగా వ్యవహరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. కార్పొరేటర్లు ప్రస్తావించే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేయాలన్నారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలపై చర్చించి, పరిష్కారం చూపేందుకు వీలుగా నెల రోజులలోపే మేయర్ అనుమతితో నగర పాలక సంస్థ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలన్నారు. కార్పొరేషన్‌కు ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు వీలుగా ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పారదర్శకంగా పరిష్కరిస్తూ అర్హత కలిగిన వారికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. సానిటేషన్ సిబ్బంది పనితీరును నిశితంగా పరిశీలించాలని కమిషనర్‌కు సూచించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది హాజరును ఫేషియల్ రికగ్నేషన్ విధానం ద్వారా అమలు చేయాలని ఆదేశించారు. కాగా అంతకుముందు మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ పంచరెడ్డి అనిత భర్త పంచరెడ్డి సురేశ్ అకాల మరణం పట్ల కౌన్సిల్ సంతాపం వ్యక్తం చేయాలని కార్పొరేటర్ న్యాలం సునీత ప్రతిపాదించగా, కౌన్సిల్ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సమావేశంలో డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, బీజేపీ ఫ్లోర్‌లీడర్ వీరమాచినేని ప్రమోద్‌కుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కార్పొరేటర్లుగా ఎన్నికై న తర్వాత మొదటి బడ్జెట్ సమావేశం కావడంతో పలువురు తమ తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి సానుకూలంగా స్పందించారు.
నగర పాలక సంస్థలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం అని, దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నగరంలో రెవెన్యూ పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రతి పార్టీ కార్పొరేటర్ ఇందుకు సహకరిస్తామన్నారు. ఇంకా రూ.100 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో పన్నుల్లో చాలా తేడా ఉందని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా నగరపాలక సంస్థ ఉద్యోగులకు, సిబ్బందికి కార్పొరేటర్లు అంటే విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యలపై సంప్రదిస్తే స్పందించడం లేదని సమావేశం దృష్టికి తెచ్చారు.
ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితమని, నిజామాబాద్ నగర అభివృద్ధే ధ్యేయంగా పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. నగరానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరగా, సానుకూలంగా స్పందించారని అన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో అన్ని డివిజన్లకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు ముసాయిదా మాస్టర్ ప్లాన్‌లో ఏవైనా సవరణలు చేయాల్సి ఉంటే కార్పొరేటర్లతో భేటీ నిర్వహించాలని సూచించారు. నగరంలో రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, స్ట్రీట్‌లైట్లు వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాలన్నారు.
ఎన్‌ఎంసీ కౌన్సిల్ ఆమోదం
ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే
ప్రధాన లక్ష్యం : నగర మేయర్
ప్రతి డివిజన్‌కు సమ ప్రాధాన్యత ఇవ్వాలి
: ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
జీతభత్యాల స్కాంపై వివరణ ఇవ్వాలని
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ డిమాండ్


