కేసుల సత్వర పరిష్కారానికే లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

కేసుల సత్వర పరిష్కారానికే లోక్‌ అదాలత్‌

Mar 29 2026 6:55 AM | Updated on Mar 29 2026 6:55 AM

మొదటి అడిషనల్‌ జిల్లా జడ్జి హరీష

నిజామాబాద్‌ లీగల్‌: పట్టు విడుపు ధోరణితోనే కేసుల సత్వర ప రిష్కారానికి అవకాశం ఉందని, కక్షిదారులు లోక్‌ అదాలత్‌ను వి నియోగించుకొని కేసులు పరిష్కరించుకోవాలని నిజామాబాద్‌ ఫస్ట్‌ అడిషనల్‌ జడ్జి హరీష పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థలో శనివారం లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సాయిసుధ, మూడో అడిషనల్‌ జిల్లా జడ్జి డి దుర్గాప్రసాద్‌, అడిషనల్‌ కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌, డీసీపీ (అడ్మిన్‌) బస్వారెడ్డి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మొదటి అడిషనల్‌ జిల్లా జడ్జి హరీష మాట్లాడుతూ కక్షిదారులు తమ కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ చక్కటి మార్గమని, దీంతో సమయంతోపాటు ధనం ఆదా అవుతుందని అన్నారు. మూడో అడిషనల్‌ జిల్లా జడ్జి డి దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవాలని సూచించారు.

ఐదో స్థానంలో జిల్లా..

లోక్‌ అదాలత్‌లో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 27,723 కేసులను పరిష్కరించారు. సివిల్‌ కేసులు 85, వెహికిల్‌ ప్రమాద కేసులు 71, సైబర్‌ క్రైమ్‌ కేసులు 76 ఉన్నాయి. యాక్సిడెంట్‌ కేసుల్లో రూ.6,33,52,500 పరిహారం అందజేశా రు. 77 సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో రూ.7, 79, 709 లను, 33 బ్యాంకు కేసుల్లో రూ.22 లక్షల 46 వేల 400లను రికవరీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement