డొంకేశ్వర్(ఆర్మూర్):ఎస్‌హెచ్‌జీ మహిళలకు 2024 –25వ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి రుణాలిచ్చి వాటిని రికవరీ చేయడంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ని లిచింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో జరిగిన 13వ వార్షిక మహాసభలో మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ చేతుల మీదుగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సా యాగౌడ్ అవార్డును అందుకున్నారు. 2024–25 సంవత్సరంలో జిల్లాకు రూ.216 కోట్ల లక్ష్యం ఉండగా రూ.216 కోట్ల రుణాలను ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందజేశారు. అలాగే తిరిగి 94 శాతం రుణాలను రికవరీ చేశారు. వరుసగా గత పదేళ్లుగా నిజామాబాద్ జిల్లాకే రాష్ట్రంలో మొదటిస్థానం రావడం సంతోషంగా ఉందని డీఆర్డీవో సాయా గౌడ్ అన్నారు. రాష్ట్రంలో ఉత్తమ మండలం అవార్డు కూడా జిల్లాలోని కమ్మర్‌పల్లికే దక్కినట్లు వెల్లడించారు. డీఆర్డీవో వెంట సీ్త్రనిధి ఆర్‌ఎం రామ్‌దాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు హేమలత ఉన్నారు.
● అవార్డు అందుకున్న డీఆర్డీవో సాయాగౌడ్


