నేటి తరానికి ఆదర్శమూర్తి శ్రీరాముడు | - | Sakshi
Sakshi News home page

నేటి తరానికి ఆదర్శమూర్తి శ్రీరాముడు

Mar 28 2026 7:20 AM | Updated on Mar 28 2026 7:20 AM

నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి

బోర్గాం(పి) చౌరస్తాలో

‘ధర్మ రక్ష సేనా’ శోభాయాత్ర ప్రారంభం

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): ఆదర్శమూర్తి శ్రీరాముడిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. నగరశివారులోని బోర్గాం(పి)లో ధర్మ రక్షణ సేనా ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్‌ ఉమారాణి–రమేష్‌ కార్యక్రమానికి హాజరై జెండా ఊపి, టెంకాయ కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరుచుకొని సన్మార్గంలో నడవాలని సూచించారు. కార్పొరేటర్లు వీరమాచినేని ప్రమోద్‌కుమార్‌, యాదాల నరేష్‌, నాయకులు ఈగ రమేష్‌రెడ్డి, రఘు, సుభాష్‌, కాంగ్రెస్‌ ఫిషర్‌మెన్‌ జిల్లా చైర్మన్‌ బోర్గాం శ్రీనివాస్‌, హన్మండ్లు, అనిల్‌రెడ్డి, అశోక్‌, లింగన్న, ధర్మరక్ష సేన నాయకులు సోమరాజు ఋషి, తదితరులు పాల్గొన్నారు.

పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పా ల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాసర టెంపుల్‌ టూరిజంలో భాగంగా డిచ్‌పల్లి ఖిల్లా రామాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మండలంలోని అమృతాపూర్‌ గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్‌ ముప్పగంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్‌ గంగాధర్‌, తారాచంద్‌నాయక్‌, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్‌, సర్పంచ్‌ ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి చిన్న సాయిరెడ్డి, ఆలయకమిటీ చైర్మన్‌ జంగం శాంతయ్య, సర్పంచ్‌ యాదగిరి, రాంచందర్‌గౌడ్‌, దర్మాగౌడ్‌, శ్యాంసన్‌, అంబర్‌సింగ్‌, బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement