డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కోసం మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి టైలరింగ్ కోర్సు (31 రోజు లు), బ్యూటీపార్లర్ (35 రోజులు), ఏప్రిల్ 10 నుంచి మగ్గం వర్క్ (31 రోజులు) కోర్సులు ప్రారంభమవుతాయన్నారు. ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజన సదుపాయం, హాస్టల్ వసతి కల్పిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రం, టూల్ కిట్స్ అందిస్తామన్నారు. 19 నుంచి 45 సంవత్సరాల వయస్సులోపు మహిళలు అర్హులన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంతవాసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి గలవారు తమ ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, 10వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, బ్యాంకు ఖా తా జిరాక్స్ వెంట తెచ్చుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం డిచ్‌పల్లిలోని ఘన్‌పూర్ రోడ్‌లోగల వెలుగు ఆఫీస్‌పక్కన ఉన్న ఎస్‌బీఐ శిక్షణ కేంద్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించాలన్నారు. లేదా 08461–295428ను సంప్రదించవచ్చన్నారు.
రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక
మోపాల్: ఉమ్మడి జిల్లాస్థాయి కుస్తీ పోటీల్లో పలువురు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ దేవేందర్ తెలిపారు. మండలంలోని మంచిప్పలో ఆదివారం నిజామా బాద్ ఉమ్మడి జిల్లాల అండర్–20 కుస్తీ పోటీ లు నిర్వహించగా 20 మంది క్రీడాకారులు హాజరయ్యారు. హోరాహోరీగా పోటీలు జరుగగా, విజేతలను పీఈటీ అభినందించారు. గె లుపొందిన క్రీడాకారులు ఏప్రిల్ 2న కామారెడ్డి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీ డాకారులు, బాలుర విభాగంలో లక్ష్మణ్ (57 కే జీలు), మణికంఠ (55 కేజీ), యోగేష్ (60 కే జీ), జగదీష్ (55 కేజీ), కృష్ణ (70 కేజీ), బాలికల విభాగంలో.. సోనియా (50 కేజీ), సఫి యా (72 కేజీ), ప్రీతి రాజ్ (68 కేజీ) ఉన్నారు.
వర్ని: మోస్రా మండల కేంద్రంలోనీ సీతారామ ఆలయంలో శనివారం రాత్రి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.


