● పంపా సాహితీ పీఠం
కవి సమ్మేళనంలో వక్తలు
బోధన్: మాతృభాష తెలుగు పరిరక్షణకు కవులు, రచయితలు, తెలుగు భాష ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని వక్తలు అన్నారు. బోధన్‌లోని ఉషోదయ జూనియర్ కళాశాలలో ఆదివారం పంపా సాహితీ పీఠం ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకొని కవి సమ్మేళనం నిర్వహించారు. జ్యోతి ప్ర జ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమ్మేళానికి వచ్చిన కవులు, రచయితలు తమ స్వీయ కవితలను వినిపించారు. నిర్వాహకులు కవులకు శాలువా, జ్ఞాపిక అందించి ఘనంగా సన్మానించారు. రచయిత తొగర్ల సురేశ్ రచించిన మెరుపు తీగలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్, ఉషోదయ, విద్యా వికాస్ విద్యా సంస్థల అధిపతులు సూర్యప్రకాశ్, శ్రీనివాస్‌రావు, ప్రత్యేక ద్వితీయశ్రేణి న్యాయమూర్తి అబ్బరాజు శేషతల్పసాయి, బోధన్, పోతంగల్ ఎంఈవో నాగయ్య, లోల శంకర్, విశ్రాంత ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షుడురాజేశ్వర్‌రావు విచ్చేశారు. పంపాసాహితి పీఠం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పురాణే అజయ్‌కుమార్, ప్రభాకర్, ప్రతినిధులు,స భ్యులు, కవులు మొగిలిస్వామిరాజ్, పబ్బమురళి, కాట్రగడ్డ భారతి, అమరావతి,డాక్టర్ గంధం విజయలక్ష్మి, శ్రీదారం గంగాధర్, మార్కొండ సాయిలు,తొగర్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


