ఊరి కోసం రూ.10 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

ఊరి కోసం రూ.10 లక్షల విరాళం

Mar 30 2026 7:27 AM | Updated on Mar 30 2026 7:27 AM

వేల్పూర్‌: మండలంలోని మోతె గ్రామానికి ఆదివారం అదే గ్రామానికి చెందిన అల్లపుల్ల గంగారెడ్డి ఆయన తండ్రి ఏలేటి అల్లపుల్ల రాజులు స్మారకార్థం రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. వీటిలో ఇప్పటికే సుమారు మూడున్నర లక్షల రూపాయల పనులు పూర్తికాగా, ఆరున్నర లక్షలతో చేపట్టే పనులను గుర్తించారు. అందులో భాగంగా స్థానిక వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆదివారం భవానీమాత మండపం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయనను సర్పంచ్‌ దొల్లరమేశ్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ పరంజ్యోతి, వార్డు సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో భవానీయూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement