● స్వయంగా వాహనాన్ని నడిపిన ఎమ్మెల్యే ధన్‌పాల్
సుభాష్‌నగర్: నగరంలోని హమాల్‌వాడి సంతోషి మాత (సాయిబాబా) ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని శోభాయాత్ర నిర్వహించారు. కానీ డీజేకు అనుమతి లేదని పోలీసులు డీజే వాహనాన్ని అడ్డుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ పోలీసులతో మాట్లాడారు. అయినా వారు వినకపోవడంతో స్వయంగా ఎమ్మెల్యేనే డీజే వాహనాన్ని నడిపారు. దగ్గరుండి శోభాయాత్రను ముందుకు నడిపించారు.


