ప్రైవేటు స్కూల్స్ హాస్టల్స్‌లో సమస్యల పర్వం..
మెనూ
తగ్గింది..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కమర్షియల్ గ్యాస్ కొరత నేపథ్యంలో జిల్లాలోని హోటళ్లలో ఆహార పదార్థాల పరిమాణం తగ్గిస్తుండడంతో పాటు ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచేశారు. గ్యాస్ కొరతను సాకుగా చూపించి అదనపు చార్జీలు వసూలు చేయొద్దని, ధరలు పెంచొద్దని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సీసీపీఏ జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ ఇవేవీ తమకు సంబంధం లేదన్నట్లు హోటళ్ల వారు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుతుండడం గమనార్హం. ఆహార పదార్థాలకు సంబంధించి పలువురు హోటల్స్ నిర్వాహకులు ఐటమ్స్ తగ్గించారు. కొన్ని హోటల్స్‌లో దోశ లాంటి టిఫిన్స్ చేయడం లేదు. కాంబో ప్యాక్ టిఫిన్స్ ఇవ్వడం లేదు. సింగిల్ ఐటమ్స్ మీద సైతం ధరలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ధరలు పెరగడంతో వినియోగదారులు హోటల్స్‌కు రావడం తగ్గించారు. దీంతో నిజామాబాద్ నగరంలో 50 వరకు చిన్న హోటల్స్ మూతపడ్డాయి. ఇలా మూసేసిన హోటల్స్‌లో ఎక్కువగా సింగిల్ సిలిండర్లు ఉన్నవి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా కొందరు గ్యాస్ డీలర్లు పెద్ద పెద్ద హోటల్స్‌కు బ్లాక్‌లో లిసిండర్‌లు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా గురువారం నగరంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద 15 రోజుల క్రితం బుక్ చేసుకున్న గృహ వినియోగదారులు ఆందోళన చేశారు. తాము గ్యాస్ బుక్ చేసుకుంటే ఇవ్వకపోగా డెలివరీ అయినట్లు మాత్రం మెసేజ్ వచ్చిందని పలువురు గొడవ చేశారు. ఇది లా ఉండగా సరిహద్దు మహారాష్ట్ర నుంచి బ్లాక్‌లో గ్యాస్ తెచ్చుకుంటున్నవారు సైతం ఉన్నారు.
గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్, ప్రభుత్వం పాఠశాలల్లో వంటకు గ్యాస్ సమస్య లేకుండా కలెక్టర్ ఇలా త్రిపాఠి తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో వాటిల్లో ఇబ్బందులు లేవు. అయితే ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన హాస్టల్స్‌లో గ్యాస్ కొరతతో కట్టెలతో వంట చేయిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో ఆయా పాఠశాలల్లో కట్టెల పొయ్యితో వంట చేసేందుకు వెనుకాడుతున్న వంట మాస్టర్లు గైర్హాజరు అవుతున్నారు. దీంతో హాస్టల్ విద్యార్థులకు ఐటమ్స్ తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వంట మనుషులు రాకపోవడంతో ఆయా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయి.
ఇదిలా ఉండగా పెట్రోలు, డీజిల్ విషయంలో ప్రజల్లో చాలావరకు అవగాహన వచ్చింది. ఫ్యూయల్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ధారణకు వచ్చిన జనం బంకుల వద్ద బారులు తీరడం మానేశారు.
కొన్ని రకాల టిఫిన్స్‌ను తగ్గించిన హోటల్స్ నిర్వాహకులు
గ్యాస్ కొరత ఉందంటూ
రూ.10 నుంచి రూ.20 వరకు పెంపుదల
సింగిల్ సిలిండర్లు ఉన్న
చిన్న హోటల్స్ మూసివేత
ప్రైవేటు పాఠశాలల హాస్టల్స్
నిర్వహణలో అవస్థలు
గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ సమస్య లేకుండా కలెక్టర్ చర్యలు
గృహ వినియోగ గ్యాస్ బ్లాక్‌లో
అమ్ముకుంటున్న డీలర్లు ?
ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్న వినియోగదారులు
డొమెస్టిక్ సిలిండర్ సమస్యలుంటే
చర్యలు తీసుకుంటాం : డీఎస్‌వో


