ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి

Mar 26 2026 11:41 AM | Updated on Mar 26 2026 11:41 AM

విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి

ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని హామీ

డిచ్‌పల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని, దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని సుద్దులం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ విశ్వరూప అభయ వీరాంజనేయ, శ్రీ ధ్యానఆంజనేయ స్వామి విజయ గణపతి విగ్రహ ప్రతిష్ఠాన మహోత్సవ వేడుకల్లో బుధవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. హనుమద్దీక్షా పీఠాధిపతులు పూజ్య దుర్గాప్రసాద్‌ స్వామి పర్యవేక్షణలో వేదపండితులు నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్తులు ఐక్యంగా ఉండి ఆలయం నిర్మాణం, విగ్రహావిష్కరణ చేపట్టడం అభినందనీయమన్నారు. ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్‌ గంగాధర్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్‌, రూరల్‌ సర్పంచుల ఫోరం అధ్యక్షులు గొట్టిపాటి వాసుబాబు, సర్పంచ్‌ తేనేటి హేమలత లక్ష్మణ్‌రెడ్డి, పార్టీ నాయకులు రాంచందర్‌గౌడ్‌, శ్యాంసన్‌, ధర్మాగౌడ్‌, మాజీ ఎంపీపీ నర్సయ్య, నర్సారెడ్డి, సురేందర్‌రెడ్డి, అంబర్‌సింగ్‌, గంగారెడ్డి, బాలరాజు, వెంకటేశ్‌, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామనవమి వేడుకలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

జిల్లాలో ప్రసిద్ది చెందిన డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో శుక్రవారం జరిగే శ్రీరామనవమి వేడుకలకు హాజరు కావాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్‌ జంగం శాంతయ్య ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మాజీ సర్పంచ్‌ బూస సుదర్శన్‌, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్‌ గంగాధర్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వాసుబాబు తదితరులున్నారు.

గడ్డి చుట్టే యంత్రం ప్రారంభం

ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించిన ఎండుగడ్డి చుట్టే యంత్రం (బేలర్‌) ను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రారంభించారు. డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లి గ్రామ రైతు పార్వతి గంగాధర్‌ ఈ గడ్డి చుట్టే యంత్రాన్ని కొనుగోలు చేశారు. బుధవారం రూరల్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఆ యంత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, డీసీసీ కార్యదర్శి డాక్టర్‌ జహూర్‌, నాయకులు శ్రీనివాస్‌, బాలగంగాధర్‌, మోహన్‌, శంకర్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ధర్పల్లికి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ మంజూరు

ధర్పల్లి : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి వచ్చిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ని ధర్పల్లికి కేటాయించినందుకు ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డిని ధర్పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించి కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్‌ బాలరాజ్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి మహేందర్‌ , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement