నిజామాబాద్ రూరల్: భద్రాచల రాములవారి కల్యాణానికి నగరంలోని కోటగల్లి హనుమాన్ దేవాలయం నుంచి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం నిజామాబాద్, వివిధ గ్రామాల నుంచి భక్తులు పంపించిన గోటి తలంబ్రాలను రామకోటి రామరాజుకు అందాయి. రామరాజు మాట్లాడు తూ.. భద్రాచలం వెళ్లలేక పోయిన భక్తులు తాము ఒలిచిన తలంబ్రాలు రామయ్య కల్యాణనికి చేరవేయడం సంతోషంగా ఉందని అన్నారు.


