ధర్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు రెడ్ రిబ్బన్ క్లబ్, ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఎయిడ్స్ నిర్మూలన అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, పోస్టర్ ప్రదర్శన పోటీలను నిర్వహించారు. మొదటి, రెండవ స్థానంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీరామ్, అధ్యాపకులు ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, రవిరాజ్, కుమారస్వామి, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.


