సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

Mar 26 2026 11:41 AM | Updated on Mar 26 2026 11:41 AM

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం రోడ్డు భద్రతపై అవగాహన అగ్ని ప్రమాదాల నివారణపై.. అనుమతి లేని నిర్మాణాలు చేపట్టొద్దు

సిరికొండ : మండలంలోని కొండాపూర్‌ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్‌ నాయకులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి రూ.20 లక్షల నిధులను మంజూరు చేశారని తెలిపారు. నిధులను మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు, డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల బుచ్చన్న, శ్రీధర్‌, ఆకుల జగన్‌, చంద్రగౌడ్‌, ఫారుక్‌, సాల్మన్‌, ఇసాక్‌, నరేష్‌, రవీందర్‌ గౌడ్‌, బాల గంగారం తదితరులు పాల్గొన్నారు.

మోపాల్‌: మండలంలోని బాడ్సిలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎస్‌ఐ జాడె సుస్మిత మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని, మైనర్లు వాహనాలు నడపవద్దని తెలిపారు. వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ పరమేశ్వర్‌, ఉపాధ్యాయులు వెంకట నారాయణ, రాజేందర్‌రెడ్డి, చంద్రకళ, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

ధర్పల్లి: ప్రజాపాలనలో కార్యక్రమంలో భాగంగా ఇందల్వాయికి చెందిన అగ్నిమాపక సిబ్బంది మండల కేంద్రంలోని నిహారిక చిల్డ్రన్‌ హాస్పిటల్లో అగ్ని ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సును బుధవారం కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వాటిని ఆర్పే విధానాన్ని హాస్పిటల్‌ సిబ్బందికి వివరించారు. అగ్నిమాపక సిబ్బంది, హాస్పిటల్‌ యజమాన్యం నరేందర్‌ చందర్‌, వైద్యురాలు నిహారిక తదితరులు పాల్గొన్నారు.

సిరికొండ : గ్రామపంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని సర్పంచ్‌ మల్లెల సాయిచరణ్‌ తాపీ మేసీ్త్రలకు సూచించారు. సిరికొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో తాపీ మేసీ్త్రలతో సర్పంచ్‌ సమావేశం బుధవారం నిర్వహించారు. సర్పంచ్‌ మాట్లాడుతూ నూతన ఇళ్లు, ప్రహరీ గోడలు గ్రామపంచాయతీ అనుమతి ఉంటేనే నిర్మించాలని తెలిపారు. మెట్లు రోడ్లపైకి డ్రెయినేజీలపైకి వచ్చేలా నిర్మించకూడదని తెలిపారు. అనుమతి లేకుండా నిర్మించిన వాటిని కూల్చివేస్తామని సూచించారు. సమావేశంలో ఉప సర్పంచ్‌ గ్యామా శోభన్‌, పంచాయతీ కార్యదర్శి వినీల్‌, వార్డు సభ్యులు శంకర్‌, తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement