న్యూస్‌రీల్
అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
నేటి నుంచి పసుపు క్రయవిక్రయాలు బంద్
గ్రామంలో ఐస్ క్రీమ్ విక్రయాలను నిషేధించాలని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐస్‌క్రీమ్ బండ్లను గ్రామంలోకి రానీయకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ మేరకు పంచాయతీ పాలకవర్గ మద్దతుతో సర్పంచ్ పోగుల అనిత ప్రత్యేకంగా వాల్‌పోస్టర్లను తయారు చేయించి గ్రామ ఎంట్రన్స్, ఊరిలో ఏర్పాటు చేయించారు. తమ గ్రామంలో ఐస్ క్రీమ్‌లు, కుల్ఫీల అమ్మకం నిషేధమని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. – ఇందల్వాయి
గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026
‘ఒక్క ఇల్లూ ఇవ్వలేదు..’
సుభాష్‌నగర్: తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలలో నిజామాబాద్ నగరంలో పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఇందిరమ్మ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మాట్లాడారు. నాగారం ప్రాంతంలో 396 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి నాలుగున్నరేళ్లు గడిచిందని గుర్తు చేశారు. ఆ ఇళ్లు వృథాగా ఉంటుండటంతో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయని తెలిపారు. అనేకసార్లు మంత్రులకు విన్నవించగా మరమ్మతుల కోసం రూ.1.25 కోట్లు విడుదల చేసినప్పటికీ ఇళ్లు మాత్రం కేటాయించలేదన్నారు. కలెక్టరేట్ సమీపంలో 200 డబుల్ ఇళ్ల పనులు 80 శాతం అయ్యాయని, మరో రూ.2 కోట్లు మంజూరు చేస్తే పూర్తవుతాయన్నారు.
పశువులకు టీకాలు వేయించాలి
నిజామాబాద్ అర్బన్: పశువులకు తప్పకుండా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వే యించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించా రు. వేసవిలో ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం లక్ష్యంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కా ర్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను కలెక్టర్ బుధవారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. పాడి రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి టీ కా లు వేసేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ వా హనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గాలి కుంటు వ్యాధితో పశువుల్లో పాల దిగుబడి తగ్గడం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని, టీకాలు వేయించడం ద్వా రా పశువుల ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చన్నా రు. గ్రామాలకు వచ్చే పశువైద్య బృందాలకు పశుపోషకులు సహకరించాలన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి
సుభాష్‌నగర్: మార్కెట్‌యార్డులో గొడవ లు, వివాదాలు లేకుండా వ్యాపారం చేయా లని, ప్రతిఒక్కరూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీస్ కమిషనర్ సా యిచైతన్య కోరారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు శ్రద్ధానంద్ గంజ్‌లో పసుపు రైతులు, వ్యాపారులతో సీపీ బుధవారం స మావేశమయ్యారు. గంజ్‌లో రైతులకు కల్పి స్తున్న సదుపాయాల వివరాలను అడిగి తె లుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజ్‌లో తప్పుడు తూకా లు, మధ్యవర్తుల మోసాలు జరగకుండా జా గ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మార్కెట్ యార్డ్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు సహకరించాలని కోరారు. సెక్యూరిటీ సిబ్బంది అన్ని గేట్ల వద్ద 24గంటల పాటు నిఘా పటిష్ట పర్చాలని, సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేయాలని, అనుమతి లేని వారిని లోనికి రానివ్వొద్దన్నారు. అనుమానాస్పద ఘటన సమయంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆయ న వెంట మూడో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై హరిబాబు, పసుపు రైతులు ఉన్నారు.
ప్రమాదాల నివారణలో కన్వెక్స్ మిర్రర్ల పాత్ర కీలకం
సుభాష్‌నగర్: రోడ్డు ప్రమాదాల నివారణలో కన్వెక్స్ మిర్రర్ల పాత్ర కీలకమని డీటీవో ఉ మా మహేశ్వర్ పేర్కొన్నారు. ఆర్టీసీ డిపో–1లోని బస్సులను ఆయన బుధవా రం పరిశీలించారు. బస్సుల్లో అమర్చిన కన్వెక్స్ మిర్రర్ల పనితీరును పర్యవేక్షించారు. అనంతరం డీటీవో మాట్లాడుతూ డ్రైవర్లకు బస్సు వెనక, పక్క దృశ్యాలను కన్వెక్స్ మి ర్రర్లు అందిస్తాయని అన్నారు. బస్సుల సాంకేతిక స్థితి, బ్రేక్ వ్యవస్థ, డ్రైవర్ క్యాబిన్, అత్యవసర భద్రతా పరికరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డిపో–1 మే నేజర్ ఆనంద్ మాట్లాడుతూ డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించేలా చర్యలు చేపడుతామన్నారు.
మరో నాలుగు
నియోజకవర్గాలు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో అంతటా అదే చర్చ సాగుతోంది. లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలను 50 శాతం మేరకు పెంచనున్నట్లు సంకేతాలు వస్తుండడంతో రాష్ట్రంలో శాసనసభ స్థానాలు 119 నుంచి 182కు, లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9 అసెంబ్లీ సీట్లు 13కు పెరగనున్నట్లు అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో జనాభా 15,71,022, కామారెడ్డి జిల్లాలో 9,72,625 ఉంది. ఇక గత ఎన్నికల(2023) లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 20,06,494 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 9,58,718 మంది, మహిళా ఓటర్లు 10,47,674 మంది, ఇతరులు 102 మంది ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం. దీంతో మహిళా కోటా శాసనసభ స్థానాలు సైతం ఉమ్మడి జిల్లా నుంచి గణనీయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పలువురు నాయకులతోపాటు మహిళా నాయకురాలు సైతం చట్టసభలో ప్రాతినిధ్యంకోసం లెక్కలు వేసుకుంటున్నారు. జనగణన, కులగణన తరువాత వెంటనే నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం చేస్తుండడంతో అన్నివర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం చూసినప్పటికీ, తాజాగా నిర్వహించే జనాభా లెక్కలు, కులగణన మేరకు చూస్తే నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 5 శాసనసభ సీట్లు 8కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో ఒక శాసనసభ సీటు పెరిగే అవకాశం ఉంది. జనాభా ఎక్కువగా ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రం, చుట్టుపక్కల ప్రాంతాలను బట్టి నిజామాబాద్ అర్బన్ పరిధిలో నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. శాసనసభ నియోజకవర్గాలన్నీ ఒకే జిల్లా పరిధిలో ఉండనున్న నేపథ్యంలో ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్, కోటగిరి, పొతంగల్ మండలాలను సైతం నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో సర్దుబాటు చేయనున్నారు. దీంతో ఈ మండలాలు బోధన్ నియోజకవర్గం పరిధిలోకి కలుపనున్నారు. ఈ నేపథ్యంలో బోధన్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఎడపల్లి, నవీపేట, రెంజల్ మండలాలను మరో నియోజకవర్గంలో కలిపే అవకాశాలున్నాయి. అలాగే కొత్తగా భీమ్‌గల్, నందిపేట, నిజామాబాద్ రూరల్ స్థానంలో డిచ్‌పల్లి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక కామారెడ్డి జిల్లాలో దోమకొండ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
● నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ నార్త్, ఎడపల్లి మండలాలు, విలీన గ్రామాలు
● నిజామాబాద్ సౌత్: నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ రూరల్, మోపాల్, మోస్రా
● డిచ్‌పల్లి: డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి
● భీమ్‌గల్: భీమ్‌గల్, సిరికొండ, ధర్పల్లి, వేల్పూర్
● బాల్కొండ: బాల్కొండ, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి
● ఆర్మూర్: ఆర్మూర్, ఆలూర్, డొంకేశ్వర్
● నందిపేట: నందిపేట, నవీపేట, రెంజల్, మాక్లూర్
● బోధన్: బోధన్, సాలూర, వర్ని, చందూర్, రుద్రూర్, పొతంగల్, కోటగిరి
● బాన్సువాడ: బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, మహ్మద్‌నగర్, నిజాంసాగర్
● జుక్కల్: జుక్కల్, బిచ్కుంద, మద్నూర్,
పెద్దకొడప్‌గల్, పిట్లం, డోంగ్లి
● ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, గాంధారి
● కామారెడ్డి: కామారెడ్డి, సదాశివనగర్,
రాజంపేట
● దోమకొండ: దోమకొండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి
డిచ్‌పల్లి: సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ పెడితే ప్రతిపక్షాలు సాకులు చెబుతూ వాకౌట్ చేయడం విడ్డూరంగా ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ అన్నివర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తుందని, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని అన్నారు. డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డులు ఉన్న వారందరికీ రూ.5 లక్షల బీమా అమలు చేయడం చారిత్రకంగా నిలిచిపోతుందన్నారు. ధర్పల్లి మండలంలో 6 ఎకరాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధిని బీజేపీ, బీఆర్‌ఎస్ అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వాసుబాబు, సర్పంచ్ తేనేటి హేమలతలక్ష్మణ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
డొంకేశ్వర్(ఆర్మూర్): యుద్ధ పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని ఓ వైపు వాహనదారులు ఆందోళన చెందుతూ పెట్రోల్ బంక్‌లకు పరుగులు తీస్తుండగా.. ఎలక్ట్రిక్ వాహనదారులు మాత్రం ఏ చింతా లేకుండా రయ్‌రయ్‌మని దూసుకెళ్తున్నారు. పెట్రోల్ ధరలు పెరిగినా, కొరత ఏర్పడినా తమకు ఎలాంటి టెన్షన్ లేదంటున్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 కిలో మీటర్లు తిరుగు తామని, డబ్బులు కూడా ఆదా అవుతున్నాయని ఆనందంగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో, పట్టణంలో ఎలక్ట్రిక్ స్కూటీల సంఖ్య పెరుగుతోంది. ధరలు కూడా రూ.40 వేల నుంచి అందుబాటులో ఉండడంతో ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, విద్యార్థులు కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు ఆఫర్లు, వారంటీలు ఇస్తున్నాయి. ఇంధన ధరలు, కొరతకు చార్జింగ్‌తో నడిచే వాహనాలు మంచి ప్రత్యామ్నాయంగా మారాయని చెప్పొచ్చు.
ఉమ్మడి జిల్లాలో ఓటర్లు (2023)
మహిళా కోటాలో 33 శాతం సీట్లు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 182కి పెరిగితే 60 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జి ల్లా నుంచి శాసనసభలో మహిళల ప్రాతినిథ్యం గణనీయంగానే ఉండే అవకాశాలున్నాయి.
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
సుభాష్‌నగర్: శ్రీరామనవమి సందర్భంగా మర్చంట్ అసోసియేషన్ వారి విజ్ఞప్తి మేరకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం నుంచి మూడు రోజులపాటు పసుపు క్రయవిక్రయాలు నిలిపేస్తున్నామని సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ బుధవారం తెలిపారు. 26వ తేదీన తూకాలు మాత్రమే జరుగుతాయని, పసుపు బీట్ చేపట్టబోమన్నారు. 26 నుంచి 28వరకు జనరల్ బీట్లు మాత్రమే నిర్వహిస్తామని, రైతులు గమనించి మార్కెట్ కమిటీకి సహకరించాలని ఆమె కోరారు.
ఎలక్ట్రిక్ బండిపై హాయిహాయిగా
పెట్రోల్ ధరలు, కొరత కష్టాలకు చెక్
ఉమ్మడి జిల్లాలో 9 నుంచి 13కు పెరగనున్న శాసనసభ స్థానాలు
నిజామాబాద్ జిల్లాలో 5 నుంచి 8కి..
కామారెడ్డి జిల్లాలో 4 నుంచి 5కు..
ఉమ్మడి జిల్లాలో పెరగనున్న
మహిళల కోటా
2011 జనాభా లెక్కల ప్రకారం
నిజామాబాద్‌లో 15,71,022..
కామారెడ్డిలో 9,72,625 మంది జనాభా
ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికం
పునర్విభజనపై అన్నివర్గాల్లో
జోరుగా చర్చ
నియోజకవర్గాల పునర్విభజన చేపడితే శాసనసభా స్థానాల స్వరూపం ఈవిధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వివిధ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి..
సామాన్యులకు ఇదే బెస్ట్..
చార్జింగ్ వాహనాలు సామా న్య ప్రజలకు ఊరట కలిగిస్తున్నాయి. పెట్రోల్ వాహనాల్లో ఎక్కువ ధర కలిగిన ఇంధనాన్ని నింపుకొని ప్ర యాణించడం ఆర్థికంగా ఇ బ్బందే. తక్కువ ధరలో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటీలను కొనుగోలు చేసి చార్జింగ్ పెట్టుకుని అతి తక్కు వ ఖర్చుతో దూర ప్రయాణం సైతం చేయొచ్చు. పెట్రోల్ ధరలు పెరిగినా, కొరత ఏర్పడిన ఇలాంటి సమయాల్లో ఈవీ వాహనాలు చాలా బెటర్.
– భీమ్‌నాయక్, నికాల్‌పూర్, డొంకేశ్వర్ మండలం


