పరుగులు పెట్టిస్తున్న ప్రచారం | - | Sakshi
Sakshi News home page

పరుగులు పెట్టిస్తున్న ప్రచారం

Mar 26 2026 7:25 AM | Updated on Mar 26 2026 7:25 AM

నిజామాబాద్‌అర్బన్‌: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా పెట్రోల్‌, గ్యాస్‌ కొరత వస్తుందని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగడంతో వినియోగదారులు బంకులు, గ్యాస్‌ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి నుంచి వాహనదారులు పెట్రోల్‌ బంకుల్లో బారులు తీరారు. వాహనాల ట్యాంకులు ఫుల్‌ చేయించుకోవడంతోపాటు క్యాన్‌లు, బాటిళ్లలు నింపుకున్నారు. కొరత లేదని అధికారులు ఎంత చెబుతున్నా బుధవారం రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. చాలా పెట్రోల్‌ బంకుల్లో మధ్యాహ్నం రెండు గంటలకే స్టాక్‌ అయిపోయింది. సోషల్‌ మీడియాలో వదంతుల కారణంగా వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం నుంచే గ్యాస్‌ ఏజెన్సీల ఎదుట వినియోగదారులు బారులు తీరారు.

కొరత లేదంటున్న అధికారులు

సోషల్‌ మీడియాలో వదంతుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ కొరతలేదని, సరఫరా కూడా సక్రమంగానే ఉందని అధికారులు అంటున్నారు. వదంతులను నమ్మొద్దని పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. బంకుల వద్ద పరిమితికి మించి కొనుగోలు చేయడం మంచిది కాదని సూచించారు. వదంతులు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పెట్రోల్‌, గ్యాస్‌ కొరత అంటూ వదంతులు

మంగళవారం రాత్రి నుంచి

పెట్రోల్‌ బంకుల్లో బారులు

గంటల్లో పెట్రోల్‌ స్టాక్‌ ఖాళీ

గ్యాస్‌ ఏజెన్సీలకు పరుగులు తీసిన వినియోగదారులు

అనవసరంగా కొనుగోలు చేశారు

బుధవారం ఉదయం నుంచే చాలామంది వాహనదారు లు వచ్చారు. కొరత ఉందంటూ అధికంగా పెట్రోలు కొ నుగోలు చేశారు. కొందరు బాటిళ్లలో తీసుకెళ్లారు. రో జూలాగే అందుబాటులో ఉందని, కొరత లేదని ఎంత చెప్పినా వినలేదు. మధ్యాహ్నం వరకే బంక్‌ ఖాళీ అయ్యింది. – భూమయ్య, పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement