హామీలు నెరవేర్చరా.. | - | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చరా..

Mar 26 2026 7:25 AM | Updated on Mar 26 2026 7:25 AM

ఇతర రాష్ట్రాల తరహాలో..

నిజామాబాద్‌ జిల్లాలో ఉద్యోగులు

కామారెడ్డి జిల్లాలో..

ఆర్మూర్‌: రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా అభియాన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు, నిరసనలు ఉధృతం చేస్తున్నారు. 18 ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపడుతూ, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. నిరసనలో భాగంగా గురువారం చలో అసెంబ్లీ కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా తమ కష్టాలు తీరుతాయని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొని పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ హయాంలో వేచి చూసిన సమగ్ర శిక్ష ఉద్యోగులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అబద్దపు మాటలతో మోసం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 19,350 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు 2023 సెప్టెంబర్‌లో సమ్మెకు కూర్చోగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో హన్మకొండలోని దీక్షా శిబిరాన్ని సందర్శించిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తానని హా మీ ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చినా సమస్యల పరిష్కారానికి పూనుకోకపోవడంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఏడాది క్రితం రోడ్డెక్కి నెల రోజుల పాటు సమ్మె బాట పట్టారు. తమ విధులను బహిష్కరించి సమ్మె చేస్తుంటే వారితో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించకపోగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడం సాధ్యపడదంటూ మాట మార్చారు. మరో వైపు సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతుగా వారి వెంటే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు గుప్పించిన ఉపాధ్యాయ సంఘాలు నాటి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి మొఖం చాటేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తమ సర్వీసును రెగ్యులరైజ్‌ చేయలేని పరిస్థితి ఉంటే పదేళ్ల నుంచి సుప్రీం కోర్టు పలుమార్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినా ఎందుకు కాతరు చేయడం లేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ ప్రారంభించే వరకు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తమకు పే స్కేల్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్‌ చేశారు. ఈ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసి మమ్మల్ని సైతం విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్‌ చేయాలి. – రాజు,

జిల్లా అధ్యక్షుడు, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం

కేజీబీవీ బోధనేతర,బోధన సిబ్బంది 599 మంది,యూఆర్‌ఎస్‌, బోధనేతర సిబ్బంది 10, డీపీవో సిబ్బంది 9, ఎంఐఎస్‌ సమన్వయకర్తలు 22, సీసీవోలు 29, సీఆర్పీలు 94, ఐఈఆర్పీలు 35, మెసెంజర్లు 19, పీటీఐలు 88, సీజీవీలు 19 మొత్తం 924 మంది ఉన్నారు.

కేజీబీవీ బోధనేతర, బోధన సిబ్బంది 480 మంది, యూఆర్‌ఎస్‌, బోధనేతర సిబ్బంది 10, డీపీవో సిబ్బంది 7, ఎంఐఎస్‌ సమన్వయకర్తలు 22, సీసీవోలు 22, సీఆర్పీలు 76, ఐఈఆర్పీలు 26, మెసెంజర్లు 18, పీటీఐలు 71, సీజీవీలు 18, మొత్తం 750 మంది ఉన్నారు.

సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్‌

మాట ఇచ్చి పదేళ్లు పట్టించుకోని

కేసీఆర్‌.. అధికారం రాగానే

మాట మార్చిన సీఎం రేవంత్‌రెడ్డి

నేడు చలో అసెంబ్లీకి

శ్రీకారం చుట్టిన ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement