● రుద్రూర్‌లో ఘటన ● ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీపీ సాయిచైతన్య ● బోధన్, నిజామాబాద్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు వైద్య చికిత్స
రుద్రూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న లారీ
రుద్రూర్ : మండల కేంద్రంలోని జవహర్‌నగర్ కా లనీ వద్ద మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 20 మందికి తీవ్రగా యాలయ్యాయి. బస్సు, లారీ డ్రైవర్లు, 18 మంది ప్రయాణికులు ఉన్నారు. మరి కొందరికి స్వల్ప గా యాలయ్యాయి. బస్సులో మొత్తం 31 మంది ప్ర యాణికులు ఉన్నారు. బోధన్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న డస్ట్ లోడ్ లారీని ఢీకొట్టింది. రెండు వాహనాల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై సాయన్న ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన లారీ కుర్నాపల్లి క్రషర్ నుంచి స్టోన్ డస్ట్‌ను పోతంగల్ మండలం పీఎస్‌ఆర్ నగర్‌లో ఇంటిగ్రెటేడ్ స్కూల్ నిర్మాణానికి తీసుకెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటన స్థలాన్ని పోలీసు కమిషనర్ పి సాయి చైతన్య పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు, రుద్రూర్ ఎస్సై సాయన్న, ఆర్టీసీ డీఎం, పోలీస్, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.
క్షతగాత్రులకు సీపీ పరామర్శ
బోధన్‌టౌన్/నిజామాబాద్‌అర్బన్: బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడి బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీపీ సాయి చైతన్య పరా మర్శించారు. మెరుగైన వైద్య సేవ లు అందించాలని వైద్యులకు సూ చించారు. ప్రమాదంలో ఓ చిన్నారి, మరో ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళల ముఖాలకు గాయాలు కాగా దంతాలు దెబ్బతిన్నాయి. లారీ డ్రైవర్ కాలికి గాయం కాగా అంబులెన్స్‌లోనే చికిత్స అందించా రు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బాలాగౌడ్‌తోపాటు మరో నలుగురికి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి మెరుగ్గానే ఉందని ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
దెబ్బతిన్న ఆర్టీసీ బస్పు
శనగ రైతులకు సెగ
బోధన్‌రూరల్: జిల్లాలో శనగ దిగుబడికి, కొను గోళ్లకు పొంతన లేకపోవడంతో రైతులు ఆందోళ న చెందుతున్నారు. దీనికితోడు శనగలను విక్ర యించేందుకు తీసుకొచ్చే రైతులకు పట్టాపాస్ పుస్తకంతోపాటు బయోమెట్రిక్ తప్పనిసరి అంటుండడంతో కౌలు రైతులు కొనుగోలు కేంద్రాల కు వెళ్లలేని స్థితి నెలకొంది. ఎన్నో ఆశలతో శనగ సాగు చేసిన రైతులను కష్టాలు వెంటాడుతున్నా యి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కాగా, అక్కడ అమలవుతున్న నిబంధనలను రైతులను అయోమయానికి గురిచేస్తు న్నాయి. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా, రైతుల నుంచి ఎకరాకు 7 క్వింటాళ్ల కొనుగోలుకు మాత్రమే అనుమతించారు.
యాసంగి సీజన్‌లో జిల్లాలో 14వేల ఎకరాలకుపైగా భూమిలో రైతులు శనగ సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 9 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్ర భుత్వం రెండు, మూడు రోజుల క్రితం మార్కె ఫెడ్ ఆధ్వర్యంలో బోధన్, కల్దుర్కి, నీలా, హున్సా, సాలూర, పొతంగల్, జాకోరా సొసైటీ ల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఒక్కో రైతు నుంచి ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్ర మే కొనుగోలు చేస్తున్నారు. మిగిలిని శనగలను తాము ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. బయోమెట్రిక్ కారణంగా కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సేకరించేది కొంతే..!
సాగు, దిగుబడి అంచనా ప్రకారం రైతుల నుంచి ఎకరాకు 10 క్వింటాళ్ల శనగలను కొనుగోలు చేయాలని నాఫెడ్‌కు వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. నాఫెడ్, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మార్కెఫెడ్ సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభించింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం లక్ష క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే 25 వేల క్వింటాళ్ల సేకరణకు అనుమతి వచ్చిందని మార్కెఫెడ్ అధికారులు చెబుతున్నారు. మిగతా పంట దిగుబడి ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా యాంత్రంగం, ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవాలని, పూర్తి పంట దిగుబడిని కొనుగోలు చేయాలని శనగ రైతులు కోరుతున్నారు.
బోధన్ మండలం కల్దుర్కిలో శనగలను కాంటా చేస్తున్న కొనుగోలు కేంద్రం నిర్వాహకులు
పూర్తిస్థాయి
కొనుగోలుకు చర్యలు
కొనుగోలు కేంద్రాల్లో రక్షేత స్థాయిలో తలెత్తున్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి. రైతుల సమస్యలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం జిల్లాలో 25 వేల క్వింటాళ్ల శనగ సేకరణకు అనుమతులు వచ్చాయి. లక్ష క్వింటాలు సేకరణకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనలు అందించాం. అనుమతులు రాగానే రైతులకు ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో శనగలు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– మహేశ్‌కుమార్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్
జిల్లాలో లక్ష క్వింటాళ్లకు పైగానే
పంట దిగుబడి
25వేల క్వింటాళ్ల సేకరణకే అనుమతి
బయోమెట్రిక్ కారణంగా
కౌలు రైతులకు ఇబ్బందులు
వెంటాడుతున్న కష్టాలు


