వన్యప్రాణుల దాహార్తికి నీటి వసతులు | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల దాహార్తికి నీటి వసతులు

Mar 25 2026 7:31 AM | Updated on Mar 25 2026 7:31 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందు కు గాను ప్రభుత్వం రూ.1.6 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత వేసవి నేపథ్యంలో వన్యప్రాణులకు నీటి సౌకర్యం కల్పించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిధులు కేటాయించింది. జిల్లా అటవీ శాఖకు మొదటి విడత గా రూ.1.6 కోట్లు ఇచ్చింది. ఏప్రిల్‌ నెలలో ఈ నిధులను వినియోగించనున్నారు. వచ్చే మే, జూన్‌ నెలలకు సంబంధించి మరో విడత లోని ధులను ఇవ్వనున్నారు. ఈ నిధులతో జిల్లాలో ని అడవుల్లో సహజ నీటి వనరులు ఎండిపోయిన చోట కృత్రిమ నీటి సౌకర్యం కల్పించనున్నారు.

జిల్లాలో ఆర్మూర్‌, కమ్మర్‌పల్లి, సిరికొండ, ఇందల్వాయి, నిజామాబాద్‌ నార్త్‌, నిజామాబా ద్‌ సౌత్‌, వర్ని అటవీ రేంజ్‌లు ఉన్నాయి. అన్ని రేంజ్‌లలో కలిపి 86,871.45 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. సాధారణంగా చలికాలం, వర్షాకాలంలో అడవుల్లో నీటి వనరు లు పుష్కలంగా ఉంటాయి. వేసవి కాలంలోనే నీటి ఎద్దడి నెలకొంటుంది. దీంతో వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతుంటాయి. ఈ క్రమంలో నీటి కో సం జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడుతుంటా యి. ఇలాంటి పరిస్థితిని నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అడవుల్లో ప్రతి 9 చదరపు కిలోమీట ర్లకు ఒకటి చొప్పున 180 చోట్ల సిమెంటుతో సాసర్‌ పిట్లను అటవీ శాఖ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అట వీ సిబ్బంది ఆయా సాసర్‌ పిట్లను శుభ్రం చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. ఇందుకోసం వాచర్లను నియమించారు.

ఒక్కో సాసర్‌ పిట్‌లో సుమారు 700 నుంచి 2,500 లీటర్ల వరకు నీరు నిల్వ ఉంటుంది. నీటి కుంటలు, చెలిమలు, పర్క్యులేషన్‌ ట్యాంకుల్లోనూ నీటి ని పట్టి ఉంచుతారు. వర్షాలు కురిసే వరకు వారానికి ఒకసారి నీటిని నింపాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.

● సహజ నీటి వనరులు, విద్యుత్‌ సౌకర్యం లేని అటవీ ప్రాంతాల్లో సోలార్‌ శక్తితో పని చేసే బో రు బావులు ఏర్పాటు చేసి నిరంతరం నీటి కుంటలు నిండేలా అటవీ శాఖ చూస్తోంది. అలాగే నీటి కుంటల వద్ద జంతువుల కదలికలను గమ నించేందుకు అటవీ అధికారులు ట్రాప్‌ కెమెరా లు అమర్చారు. వీటి ద్వారా చిరుతలు, ఎలుగు బంట్లు, జింకలు, ఇతర వన్యప్రాణులు నీరు తాగుతు న్న దృశ్యాలను అధికారులు రికార్డు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నీటి నిల్వల గురించి తనిఖీ చేస్తున్నారు.

అన్ని చర్యలు చేపడుతున్నాం

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కో సం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకు న్నాం. జంతువుల దాహార్తిని తీర్చేందుకు ప్రభు త్వం నిధులు విడుదల చేసింది. వన్యప్రాణులు నీటి కోసం రోడ్లపైకి, జనసంచార ప్రాంతాల్లోకి రాకుండా ఉండేందుకు అడవుల్లోనే కుంటలు, సాసర్‌ పిట్లలో నీటిని నింపి ఉంచుతున్నాం. వికాస్‌మీనా, జిల్లా అటవీ అధికారి

రూ.1.6 కోట్లు మంజూరు

చేసిన ప్రభుత్వం

జిల్లాలో 86,871.45 హెక్టార్ల

అటవీ ప్రాంతం

ఇప్పటికే 180 చోట్ల

సాసర్‌ పిట్‌ల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement