గ్రంథాలయాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి

Mar 25 2026 7:31 AM | Updated on Mar 25 2026 7:31 AM

ఖలీల్‌వాడి: జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయా ల సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆర్థి క సంవత్సరంలో గ్రంథాలయాల అభివృద్ధి కి రూ. 6.44 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి రూ.4కోట్లు, నందిపేట్‌, సిరికొండ లైబ్రరీలకు సొంత భవనాల నిర్మాణానికి రూ.44 లక్షల నుంచి రూ.45 లక్షల తో ఆమోదించినట్లు తెలిపారు. సాలూరలో శాఖా గ్రంథాల యం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతా మన్నారు. డిచ్‌పల్లి, వెల్మల్‌లలో టాయిలెట్స్‌ నిర్మాణం చేపట్టేందుకు ఆమోదించినట్లు చె ప్పారు. నూతన పుస్తకాల కొనుగోలు కోసం రూ.8 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆరు గ్యారంటీలకు

చట్టబద్ధత కల్పించాలి

సుభాష్‌నగర్‌: ప్రభుత్వం ప్రవేశపెట్టి న ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించా లని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆయన పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినప్ర భుత్వం.. బడ్జెట్‌లో భారీగా నిధులను తగ్గించిందన్నారు. బడ్జెట్‌లో నిధుల కేటాయింపును తగ్గించారని, ఇప్పటి వరకు విడుదల చేసింది రూ.300 కోట్లు మాత్రమేనన్నారు. ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న వే లాది మంది ఆటో డ్రైవర్లను ఆదుకుంటామ ని ప్రకటించిన ప్రభుత్వం.. ఈ బడ్జెట్‌లో వారికి మొండి చేయి చూపించిందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలన్నారు. ఎస్సీ సంక్షేమానికి గత సంవత్సరంలో రూ.40 వేల కోట్లు నిధు లు కేటాయించ గా ఈసారి రూ.11 వేలకు పరిమితం చేయ డం దారుణమన్నారు. ప్రస్తుత బడ్జెట్‌ నిరా శ కలిగించిందని తక్షణమే సవరణ చేయా లని ధన్‌పాల్‌ అసెంబ్లీలో పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల

నివారణకు కృషి చేయాలి

నిజామాబాద్‌ అర్బన్‌ : రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కమిషనరేట్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రోడ్డు భద్రత కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. రోడ్డు ఆ క్రమణలను తొలగించాలన్నారు. అటవీ ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా రిఫ్లె క్టర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయా ల ని సూచించారు. అదనపు డీసీపీ బస్వారె డ్డి, రవాణ శాఖాధికారి ఉమా మహేశ్వర రా వు, ఆర్టీసీ డీఎం ఆనంద్‌, ఏసీపీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement