క్షయ రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

క్షయ రహిత సమాజమే లక్ష్యం

Mar 25 2026 7:00 AM | Updated on Mar 25 2026 7:00 AM

డీఎంహెచ్‌వో రాజశ్రీ

జీజీహెచ్‌లో టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ 2.0 ప్రారంభం

సుభాష్‌నగర్‌: క్షయ రహిత సమాజమే లక్ష్యంగా అందరం పని చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఏడో అంతస్తులో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షయ అంటువ్యాధి అయినప్పటికీ.. పూర్తిగా నయమయ్యే వ్యాధి అని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచనల ప్రకారం పూర్తి చికిత్స తీసుకుంటే వ్యాధిని జయించవచ్చన్నారు. ప్రభుత్వం క్షయ నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, అయినప్పటికీ ప్రజల సహకారం లేకుండా ఈ లక్ష్యం సాధ్యం కాదని అన్నారు. క్షయ లక్షణాలను గుర్తించాలని, దగ్గు రెండు వారాలకుపైగా ఉంటే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. క్షయ రోగులను వివక్ష లేకుండా ఆదరించి వారికి మానసిక ధైర్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. ‘ఎస్‌! వీ కెన్‌ ఎండ్‌ టీబీ’అనే థీమ్‌ను అందరం ఆచరణలో పెట్టాలని, ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా భావించి క్షయ నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ 2.0 కా ర్యక్రమాన్ని డీఎంహెచ్‌వో జీజీహెచ్‌లో ప్రారంభించారు. క్రమం తప్పకుండా మందులు వాడి టీబీని జయించిన ఇద్దరు టీబీ చాంపియన్లను సన్మానించారు. డీటీసీవో డాక్టర్‌ దేవినాగేశ్వరి, జీజీహెచ్‌ సూ పరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు, పల్మనాలజీ హెచ్‌వోడీ ప్రశాంత్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో అశ్వినీ, వైద్యులు వెంకన్న, అవంతి, రవిగౌడ్‌, లక్ష్మణ్‌, నరేశ్‌, వెంకటేశ్వర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement