● ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై
నమ్మకాన్ని పెంచాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
బోధన్‌టౌన్(బోధన్) : ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని, ప్రజలకు ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలని కలెక్టర్ ఇలా త్రిపా ఠి అన్నారు. బోధన్‌లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. ఆనంతరం వైద్యాధికారులతోపాటు వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో నెలకొన్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి లో పూర్తిగా వసతులు కల్నించేలా చర్యలు చేపడు తామని, వైద్య సేవలను పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. గైనకాలజిస్టును నియమించడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు సోకకముందే జాగ్రత్తలు తీసుకోవాలని, మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాల ని ఆదేశించారు. ఆస్పత్రిలో అవసరమైన మౌలిక స దుపాయాలను, వైద్యులను, వైద్య సిబ్బందిని సమకూరుస్తామని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, వైద్య సేవల్లో లోపాలు ఉంటే ఉపేక్షించేది లేదని సూచించారు. ఆస్పత్రుల సమన్వయ కర్త శ్రీనివాస్ ప్రసాద్, వైద్యులు రాహుల్ ఉన్నారు.


