కంటిచూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి.. | - | Sakshi
Sakshi News home page

కంటిచూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Mar 25 2026 7:00 AM | Updated on Mar 25 2026 7:00 AM

సుభాష్‌నగర్‌ : శరీర అవయవాలలో అత్యంత ప్రధానమైన కంటి చూపును ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నా రు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లా అంధ త్వ నివారణ సంస్థ ద్వారా దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దా లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి బాలబాలికలకు కంటి అద్దాలు అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇదివరకు తాను కూడా దృష్టి లోపంతో ఇబ్బందిపడ్డానని, తగిన వ్యాయామాలు, సరైన ఆహారపు అలవాట్లతో ఆ సమస్యను అధిగమించానని వెల్లడించారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు వీలుగా జిల్లాలో సుమారు 70 వే ల మంది వరకు విద్యార్థులకు నేత్ర పరీక్షలు చే యాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 41 వేల మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయన్నారు. కంటి సంబంధిత సమస్యలకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు పలు ప్రశ్నలు వేస్తూ, సరైన సమాధానాలు చెప్పిన వా రికి కలెక్టర్‌ బహుమతులు అందజేశారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకు ని టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగస్వాము లం అవుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో క లెక్టర్‌ మొక్కలు నాటారు.డీఎంహెచ్‌వో రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్‌వో అశ్విని, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి అశోక్‌, జిల్లా అంధత్వ నివారణ సంస్థ పీవో సుజాత, మెడికల్‌ ఆఫీసర్‌ అజ్మల్‌, హెచ్‌ఎం శంకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement