దేశాన్ని సుస్థిరంగా ఉంచడానికే బీజేపీ కృషి | - | Sakshi
Sakshi News home page

దేశాన్ని సుస్థిరంగా ఉంచడానికే బీజేపీ కృషి

Mar 23 2026 9:11 AM | Updated on Mar 23 2026 9:11 AM

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారతదేశాన్ని సుస్థిరంగా ఉంచడానికి బీజేపీ కృషి చేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ పటేల్‌ కులాచారి అన్నారు. మండల కేంద్రంలోని ఎస్‌పీఆర్‌ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం పండిట్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ ప్రశిక్షణ మహాభియాన్‌ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి దినేష్‌ పటేల్‌ ముఖ్య అతిథిగా హాజరై, శిక్షణ తరగతులను ప్రారంభించారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించి, మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని క్షేత్ర స్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా నరేంద్ర మోదీ ముందుచూపుతో దేశానికి ఎలాంటి విపత్తు రాకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకున్నాడన్నారు. రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులో అండగా ఉంటున్నారని తెలిపారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలిచి బీజేపీ అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రూరల్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. జాతీయ పసుపుబోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మురళీధర్‌గౌడ్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్‌ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు, కార్పొరేటర్‌ ప్రమోద్‌, మాజీ ఎంపీపీ గద్దె భూమన్న, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రకాంత్‌, నాయకులు చౌకి లక్ష్మణ్‌, రవిగౌడ్‌, నక్క రాజేశ్వర్‌, నాయిడి రాజన్న, కేపీరెడ్డి, సురేష్‌, విఠల్‌, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement