వేల్పూర్: మండలంలోని మోతె హైస్కూలులో 2001–02 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా చిన్ననాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కచోట కలవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ ఆనాటి తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. అనంతరం నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విందులతో ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


