గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

Feb 26 2026 9:09 AM | Updated on Feb 26 2026 9:09 AM

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

కందకుర్తి వద్ద వీఐపీ ఘాట్‌ నిర్మించాలి

భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు

పుష్కర క్షేత్రం నిర్వహణ తీరుపై

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అసంతృప్తి

రెంజల్‌(బోధన్‌): వచ్చే సంవత్సరం జూలై నెలలో జరుగనున్న గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. బుధవారం పలు శాఖల అధికారుల తో రెంజల్‌ మండలం కందకుర్తి త్రివేణి సంగమ పు ష్కర క్షేత్రాన్ని ఆమె సందర్శించారు. జిల్లాలో పు ష్కర ఘాట్ల వద్ద ఉన్న వసతులు, క్షేత్రాలలోని ఆలయాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, స్థానికులతో కలిసి చర్చించారు. జిల్లాలోనే అత్యధి కంగా భక్తులు వచ్చే కందకుర్తి పుష్కర క్షేత్రంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించిన కలెక్టర్‌ పంచాయతీరాజ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఘాట్లను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులకు అవసరమైన వంట గదులు, తాగునీరు, సీ్త్రలు బట్టలు మార్చుకునే గదు లు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్‌, రూట్‌మ్యాప్‌, స్టాళ్ల ఏర్పాటు వంటి అన్ని రకాల ఏర్పాట్లతోపాటు అవసరమైన ప్రదేశాల్లో రోడ్డు వంతెనల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కందకుర్తి పుష్కర క్షేత్రం వద్ద గత పుష్కరాల్లో నిర్మించిన వంతెన కుంగిపోవడాన్ని పరిశీలించారు. వెంటనే కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న నాలుగు ఘాట్లను వినియోగంలోకి తేవడంతోపాటు కొత్తగా అంతర్రాష్ట్ర వంతెనకు పక్కన వీఐపీ ఘాట్‌ నిర్మించాలని సూచించారు. పుష్కరాల సమయంలోనే కాకుండా పండుగలు, ప్రతి ఆది, శుక్రవారాలలో పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అందించే సౌకర్యాలు ఇలాగే ఉంటాయా? అని ప్రశ్నించారు. పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ విజయ రామారావు, సర్పంచ్‌ గయాసుద్దీన్‌, తహసీల్దార్‌ శ్రవణ్‌ కుమార్‌, మాజీ సర్పంచ్‌ కలీం బేగ్‌లతోపాటు ఆయా శాఖల అధికారులు స్థానికులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement