లెక్కలు చెప్పాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

లెక్కలు చెప్పాల్సిందే..

Feb 22 2026 7:04 AM | Updated on Feb 22 2026 7:04 AM

లెక్కలు చెప్పాల్సిందే..

లెక్కలు చెప్పాల్సిందే..

ఆర్మూర్‌: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల పర్వం ము గిసినా పోటీ చేసిన అభ్యర్థులు ఇంకా ఎన్నికల అధికారులకు ఖర్చుల వివరాలను వెల్లడించలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం కౌన్సిలర్‌ అభ్యర్థి ఎన్నికల ప్రచారం కోసం రూ. లక్ష, కార్పొరేటర్‌ అభ్యర్థి రూ. 5 లక్షలకు మించి ఖర్చు చేయ వచ్చు. అయితే, కౌంటింగ్‌ పూర్తయిన రోజు నుంచి 40 రోజులలో కార్పొరేటర్‌, కౌన్సిలర్‌గా పో టీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చును విధిగా ఎన్నిక ల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చును సమర్పించని అభ్యర్థులు ఐదేళ్ల తర్వాత నిర్వహించే మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పరిగణింపబడతారనే నిబంధన సైతం అమలులో ఉంది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 60 డివిజన్లలో వివిధ పార్టీలతోపాటు స్వ తంత్రులు కలిపి 350 మంది అభ్యర్థులు, ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డు ల్లో 153 మంది, బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డుల్లో 162 మంది, భీమ్‌గల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు 49 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆర్మూర్‌లో 51 మంది, బోధన్‌లో 10 మంది అభ్యర్థులు మాత్రమే ఖర్చుల వివరాలను ఎన్నికల అధికారికి నివేదించారు. భీమ్‌గల్‌ మున్సిపాలిటీలో ఎన్నికల అధికారి వద్ద సమాచారం లేదు. మిగతా ప్రాంతాల్లోనూ చాలా మంది అభ్యర్థులు ఖర్చుల వివరాలు ఇంకా చెప్పలేదని తెలుస్తోంది.

ఎన్నికల ఖర్చులు నివేదించని

‘మున్సిపోల్స్‌’ అభ్యర్థులు

కౌంటింగ్‌ ముగిసిన 40 రోజుల్లో

వివరాలు సమర్పించాలి

నిబంధనలు బేఖాతరు చేస్తే

మరోసారి పోటీకి అనర్హులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement