ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునే యత్నం | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునే యత్నం

Feb 22 2026 7:00 AM | Updated on Feb 22 2026 7:00 AM

ఇసుక

ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునే యత్నం

ఇరువర్గాల ఘర్షణ పేకాట స్థావరంపై దాడి ఇసుక వాహనాల పట్టివేత

ఆటోను ఢీకొన్న బైక్‌.. ఇద్దరికి గాయాలు

మోపాల్‌: మండలంలోని కాల్పోల్‌ తండాలో శనివారం ఉదయం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎస్సై జాడె సుస్మిత కథనం ప్రకారం.. సర్పంచ్‌ మెగవత్‌ రవిని కించపరుస్తూ కొంతకాలంగా బస్సీ శ్రీకాంత్‌, బస్సీ జనార్దన్‌, బస్సీ శ్రీరామ్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. శుక్రవారం కూడా బూతుమాటలతో వాయిస్‌ మెసేజ్‌ పెట్టారు. ఇదే విషయాన్ని రవి నిలదీయగా, ఇరువు రి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో బస్సీ శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులు బస్సీ మంగూరామ్‌,లచ్చి, బిక్యా లక్ష్మి, మరికొందరు కలిసి రవిపై కట్టెలతో దాడికి పాల్పడ్డారు. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అదేవిధంగా మేకపిల్ల విషయంలో తన త మ్ముడు బస్సీ జనార్దన్‌ను సర్పంచ్‌ రవి, మరికొంద రు అడ్డుకుని దూషించడమే కాకుండా భౌతిక దాడి కి పాల్పడ్డారని బస్సీ శ్రీకాంత్‌ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పరస్పర ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎస్సై కౌంటర్‌ కేసు నమోదు చేశారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని ఎస్సై తెలిపారు.

జక్రాన్‌పల్లి:మండలంలోని కలిగోట్‌ గ్రామంలో పే కాటస్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేశ్‌ శనివారం తెలిపారు. గ్రామంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడులు నిర్వ హించామన్నారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకుని వారి నుంచి రూ. 6,190 నగదును స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా పే కాట ఆడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

కాలువలో పడి బాలుడి మృతి

బోధన్‌: ప్రమాదవశాత్తు కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం జానకంపేటలో చోటు చేసుకుంది. ఎడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జానకంపేట గ్రామానికి చెందిన హఫీజ్‌(4) శుక్రవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న నిజాంసాగర్‌ కాలువ ప్రాంతానికి స్థానిక పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ప్రమాదవశాత్తు కాలువ నీటిలో పడి కొట్టుకుపోయాడు. కుటుంబీకులు గాలించినా బాలుడి ఆచూకీ దొరకలేదు. శనివారం నవీపేట మండలం అబ్బాపూర్‌ శివారులోని నిజాంసాగర్‌ కాలువలో బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి తండ్రి షేక్‌ అఫ్జల్‌ ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

వృద్ధుడి అదృశ్యం

నిజామాబాద్‌ రూరల్‌: మాక్లుర్‌ మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన బీరెల్లి కిషన్‌రావు(75) అనే వృద్ధుడు అదృశ్యమైనట్లు రూరల్‌ ఎస్‌ఎచ్‌వో శ్రీనివాస్‌ శనివారం తెలిపారు. కిషన్‌రావు జిల్లా కేంద్రంలోని లక్ష్మీప్రియనగర్‌లో ఉన్న బంధువు ఇంటికి వచ్చాడు. ఈ నెల 18న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు 8712659735 నంబర్‌ను సంప్రదించి స్థానిక పీఎస్‌లో సమాచారం అందించాలని ఎస్‌హెచ్‌వో కోరారు.

బోధన్‌రూరల్‌: సాలూర మండలం కేంద్రం, బోధన్‌ మండలంలోని కల్దుర్కి, రాంపూర్‌ శివారులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు బోధన్‌ రూరల్‌ ఎస్సై మచ్చేందర్‌ రెడ్డి తెలిపారు. శనివారు 2 ట్రాక్టర్లు, ఒక లారీను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

రెంజల్‌: మండలంలోని పేపర్‌మిల్‌ గ్రామ పంచా యతీ ఎదురుగా ఉన్న ఇసుక అక్రమ నిల్వలను శు క్రవారం రాత్రి గుర్తించిన రెవెన్యూ, పోలీసు సిబ్బంది తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌కు సమాచారం అందించారు. శనివారం రెవెన్యూ సిబ్బంది నిల్వ చేసిన ఇసుకను తహసీల్‌ కార్యాలయానికి తరలించేందు కు ప్రయత్నించగా కొందరు మహిళలు అడ్డుకున్నా రు. తాము ఇందిరమ్మ లబ్ధిదారులమని ఇంటి ని ర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచి పోవడంతో ఇ క్కడ డంప్‌ చేయించుకున్నామని సిబ్బందితో వా గ్వాదానికి దిగారు. విషయాన్ని తహసీల్దార్‌కు వివ రించడంతో ఆయన బోధన్‌ ఏసీపీ దృష్టికి తీసుకెళ్లా రు. రెంజల్‌–2 ఎస్సై రాజుతో పాటు మహిళా పోలీసులు, కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే అరెస్టు చేయాల్సి వస్తుందని హెచ్చరించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

మండల కేంద్రంలో ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే వాదనలు అధికంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. పేపర్‌మిల్‌ గ్రామంలో ఇసుక నిల్వలను గుర్తించిన రెవెన్యూ, పోలీసు సిబ్బంది తహసీల్‌ కార్యాలయానికి తరలించేందుకు ప్రయత్నించగా దానిని అడ్డుకునేందుకు మాఫియా తెగించింది.

కొందరు తమకు అనుకూలమైన మహిళలను రెచ్చగొట్టి రెవెన్యూ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడేలా ఉసిగొల్పి పంపారు. నలుగురు మహిళలు అక్కడికి చేరుకుని తామే ఇందిరమ్మ లబ్ధిదారులమని ఇంటి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచి పోవడంతో ఇక్కడ డంప్‌ చేయించుకున్నామని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అధికారుల జోక్యంతో గొడవ సద్దుమనిగింది.

భిక్కనూరు: మండలంలోని బీటీఎస్‌ చౌరస్తా వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కామారెడ్డి నుంచి హైదరా బాద్‌ వైపు వెళ్తున్న ఆటోను అదే దారిలో వేగంగా వ స్తున్న బైక్‌ ఢీకొన్నది. బైక్‌ నడిపిస్తున్న మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం చల్మెడకు చెందిన తుమ్మల ఆనంద్‌కు తీవ్రగాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరాడు. ఆటోలో ప్రయాణిస్తున్న భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన మంజుల అలియాస్‌ స్వప్నకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో జాతీయ రహదారిపై వెళ్తున్న సివిల్‌ సప్లై ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారి శ్రీనివాస్‌రావు స్పందించి గాయాలపాలైన ఆనంద్‌తోపాటు మంజులను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునే యత్నం 1
1/2

ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునే యత్నం

ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునే యత్నం 2
2/2

ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునే యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement