పంచాయతీలకు రూ. 27.23 కోట్లు
నిధులు లేక ఇబ్బందిగా..
నిధులు విడుదల చేయాలి
మోర్తాడ్: గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదల కావాల్సిన నిధులు రూ. వందల కోట్లలో ఉంటే కేవలం పదుల సంఖ్యలోనే విడుదల చేయడంతో సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎలా చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. జీపీలకు ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడ్డ పాలకవర్గాలు లేవని ఆర్థిక సంఘం నిధుల విడుదలను కేంద్రం నిలిపివేసింది. సర్పంచ్ ఎన్నికల తంతు ముగిసిపోగానే ఆర్థిక సంఘం నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కాగా మంజూరైన నిధుల విడుదల్లో కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తోందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక సంఘం ద్వారా జిల్లాలోని 545 గ్రామ పంచాయితీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం నెలకు రూ.10,30,24,879 చొప్పున నిధులు విడుదల కావాల్సి ఉంది. డిసెంబర్ నాటికి 22 నెలల బకాయిలు రూ.226,65,47,338 పేరుకుపోయాయి. ఇందులో సగం వచ్చినా పెండింగ్ బిల్లుల చెల్లింపులు పూర్తి చేసి కొత్త పనులు చేయడానికి అవకాశం ఉంది. జీపీల్లో నిధులు లేకపోవడంతో కొత్త పనులు చేసే పరిస్థితి లేదు. దీంతో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నా అప్పులు తెచ్చి పనులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. చిన్న పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు తప్ప మరో మార్గం లేదు. కొన్ని పెద్ద జీపీల్లోనే పన్నుల ఆదాయంతో ఎంతో కొంత పనులు చేయవచ్చు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్థిక సంఘం బకాయిలు పూర్తిగా విడుదల చేయాలని సర్పంచులు కోరుతున్నారు.
జీపీల్లో నిధులు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు ఇచ్చినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌సీ నిధులను విడుదల చేసి పంచాయితీలను ఆదుకోవాలి. కొత్త సర్పంచులపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయి.
– మహబూబ్, సర్పంచ్, చౌట్‌పల్లి
మాపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం నిధు లు విడుదల చేస్తేనే జీపీల్లో ప నులు సాగుతాయి. కానీ నిధు ల విడుదలలో తీవ్ర జాప్యం వ ల్ల సమస్యలు పెరుగుతున్నా యి. కేంద్రం స్పందించి వెంటనే బకాయిలను పూ ర్తిగా విడుదల చేయాలి
– పావని, సర్పంచ్, తాళ్లరాంపూర్
15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో
రూ. 199.42 కోట్లు
అరకొర నిధులతో పనుల ఎలా చేయాలో తెలియక తలలు
పట్టుకుంటున్న సర్పంచులు
పంచాయతీలకు రూ. 27.23 కోట్లు
పంచాయతీలకు రూ. 27.23 కోట్లు


