కానిస్టేబుల్ సౌమ్య మృతికి సంతాపం
నిజామాబాద్ అర్బన్/సుభాష్‌నగర్: ఎకై ్సజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సంతాపం తెలిపారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేసిందని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, సౌమ్య మతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. చిన్న వయస్సులోనే ఉద్యోగం సంపాదించి ఎన్నో కలలు కన్న కానిస్టేబుల్ సౌమ్య మరణించారనే వార్త తనకు ఎంతో బాధ కలిగించిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని ధన్‌పాల్ డిమాండ్ చేశారు.
గంజాయి స్మగ్లర్లను పట్టుకునే సమయంలో ప్రమాదానికి గురైన ఎకై ్సజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు కెంపుల నాగరాజు, రేవంత్, సభ్యులు నివాళులు అర్పించారు. సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మోస్రాలో స్వచ్ఛందంగా బంద్
వర్ని(మోస్రా): గంజాయి స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి ఆమె స్వగ్రామమైన మోస్రాలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. దుకాణాలు, పెట్రోల్ బంకులు, హో టళ్లు, వ్యాపార సముదాయాలు మూసివేశారు. ప్ర ధాన కూడలిలో మండల వాసులు, పలు పార్టీల నా యకులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
కానిస్టేబుల్ సౌమ్య మృతికి సంతాపం


