సంక్షిప్తం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం

Feb 1 2026 3:07 AM | Updated on Feb 1 2026 3:07 AM

సంక్ష

సంక్షిప్తం

కరపత్రాల ఆవిష్కరణ

ఖలీల్‌వాడి: నగరంలోని జీజీ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మార్చి 24న ‘క్రెడిల్‌ టూ క్రెడిల్‌ కెమిస్ట్రీ: నూతన సంశ్లేషణను సామాజిక స్థిరత్వంతో అనుసంధానించడం’ అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ రామ్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కళాశాలలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను తెలంగాణ విశ్వవిద్యాలయ రసాయన శాస్త్రాధిపతి సాయిలు, వైస్‌ ప్రిన్సిపాల్‌ రంగరత్నం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్‌ రాజేశ్‌, అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ నహీదబేగం, దండు స్వామి, రామస్వామి, వినయ్‌ కుమార్‌, హనుమాండ్లు, బాలమణి, ఉదయభాస్కర్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన సదస్సు

ధర్పల్లి: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఇంటర్‌ విద్యార్థులకు ఉన్నత విద్య, కెరీర్‌ గైడెన్స్‌పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటర్‌ తర్వాత చదవాల్సిన చదువులు, డిగ్రీ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో టీయూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ శరత్‌, రాజేశ్వర్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌ ఉప సర్పంచ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్‌ బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

పౌర హక్కుల దినోత్సవం

ధర్పల్లి: కుల వివక్షత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని తహసీల్దార్‌ శాంతా అన్నారు. మండల కేంద్రంలో శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సమాజంలో హక్కులకు ఎవరూ భంగం కలిగించవద్దని, హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సర్పంచ్‌ చెలిమెల శ్రీనివాస్‌, ఎస్సై శ్రీనివాస్‌, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవాలకు హాజరు కావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ గ్రామ బీజేపీ నాయకులు అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారికి శనివారం ఆహ్వానపత్రికలను అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రకాంత్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీశ్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మానస సాయి, సీనియర్‌ నాయకులు ముల్క శ్రీనివాస్‌, వినోద్‌ రెడ్డి, నరేశ్‌ తదితరులు ఉన్నారు.

ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

సిరికొండ: మండలంలోని తూంపల్లి అడవుల్లో కొలువైన ఎదురుకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా దేవేరుల పల్లకీ సేవను భక్తులు భక్తి శ్రద్ధల తో నిర్వహించారు. పురోహితులు కందాళై విజయ్‌కుమారాచార్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తూంపల్లి, గోప్యానాయక్‌ తండా,వర్జన్‌ తండా సర్పంచులు జినుక రా జేందర్‌, మాలావత్‌ సుబ్బరవినాయక్‌, బుజ్జి మోజీరాం, ఆ లయ కమిటీ చైర్మన్‌ బూస ప్రసాద్‌, రాజేశ్వర్‌గౌడ్‌, బూస రా జు,ఉపసర్పంచ్‌అయినాల శ్రీకాంత్‌, రఘు, భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా గరుడ సేవ

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో కొనసాగుతున్న సీతారామచంద్ర స్వామి సప్తాహిక ధ్వజారోహణ తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి వారు గరుడ వాహనంపై ఊరేగింపు జరిపారు. ఉత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణం, నిత్య హోమం కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు సుమిత్‌ శర్మ దేశ్‌పాండే ఆధ్వర్యంలో నిర్వహించారు. రాత్రికి విశేషమైన గరుడసేవ, నివేదన, హారతి, మంత్రపుష్పం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ జంగం శాంతయ్య, సర్పంచ్‌ లక్కీడి యాదగిరి, ఆలయ ధర్మకర్త బెజవాడ రామదాసు గుప్తా, ఆలయ కమిటీ డైరెక్టర్లు, వీడీసీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మాఘ శుద్ధ పౌర్ణమి ఆదివారం రాత్రి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇసుక డంపుల స్వాధీనం

ధర్పల్లి: మండలంలోని కొటాలపల్లి, బీరప్ప తండాలో అక్రమంగా డంపు చేసిన ఐదు ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్‌ శాంత తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సై శ్రీనివాస్‌, ఆర్‌ఐ రాజేశ్వర్‌ ఉన్నారు.

సంక్షిప్తం1
1/3

సంక్షిప్తం

సంక్షిప్తం2
2/3

సంక్షిప్తం

సంక్షిప్తం3
3/3

సంక్షిప్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement