పర్సంటేజీల చిట్టా ఉంది
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్ ధర్మపురి, పక్కన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, రాకేశ్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎంపీ ల్యాడ్స్ పనులకు సంబంధించి అధికారులు తీసుకుంటున్న ప ర్సంటేజీల చిట్టా తనవద్ద ఉందని, తీరు మా ర్చుకోకుంటే వచ్చే సమావేశంలో పేర్లు బయటపెట్టి చర్యలకు సిఫారసు చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. ఎంపీ అధ్యక్షతన మంగళవారం ‘దిశ’ (జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమి టీ) సమావేశం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అమృత్ పథకం కింద భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఆర్వోబీ, ఆర్ యూబీ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు. అలాగే పీఎం విశ్వకర్మ పథకం కింద అర్హులైన వారందరూ లబ్ది పొందేలా చర్యలు తీసుకోవాలని, పథకం అ మలులో ద్వితీయ స్థానంలో ఉన్న జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపాలన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
సిరికొండ మండలంలో అట వీ భూములు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ని ర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నార ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. దీనిపై అటవీ అధికారులు పొంతనలే ని సమాధానాలు చెప్పడంతో ఎంపీ అర్వింద్ ఆగ్రహించారు. అటవీ అధికారులు మాట్లాడకుండా కూర్చోవాలంటూ మండిపడ్డారు.
తిలక్ గార్డెన్ కాంప్లెక్స్‌లో బినామీలు
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నిజామాబాద్ నగర పాలక సంస్థకు చెందిన తిలక్ గార్డెన్ వాణిజ్య సముదాయాల్లో బినామీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, కార్పొరేషన్‌కు నామమాత్రపు అద్దెలు సైతం సంవత్సరాల తరబడి చెల్లించడం లేదన్నారు. పైగా మడిగెలను సబ్ లీజ్‌కు ఇచ్చి వేలాది రూపాయలు తీసుకుంటున్నారన్నారు. దీనిపై నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్ స్పందిస్తూ దీనిపై సమగ్ర పరిశీలన జరిపామన్నారు. నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. అద్దె పెంపు, లీజు రద్దు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వ భవనాలు నిర్మించాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. స్థలం కొరత ఉందంటూ వివిధ ప్రభుత్వ శాఖల నూతన భవనాల నిర్మాణాన్ని ఆలస్యం చేయొద్దని, సమస్యను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. భారీ వర్షాల కారణంగా పంట పొలాల్లో ఇసుక మేటలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని దిశ కమిటీ సభ్యులు కోరారు. సీజీజీ ఆధ్వర్యంలో ఇసుక తొలగింపు ప్రక్రియను త్వరలోనే చేయిస్తామన్నారు. నిధులు అందుబాటులో ఉన్నందున ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చూడాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు.
అభివృద్ధి పనుల కోసం కేటాయించిన స్థలాలు కబ్జాకు గురైతే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన వారు లబ్దిపొందేలా జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక చొరవ చూపుతున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, దిశ కమిటీ సభ్యులు ఆశన్న, లింగం, విజయ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులు తీరు మార్చుకోండి..
లేనిపక్షంలో పేర్లు బయటపెట్టి
చర్యలకు సిఫారసు చేస్తా
దిశ మీటింగ్‌లో ఎంపీ ల్యాడ్స్‌పై
హెచ్చరించిన ఎంపీ ధర్మపురి అర్వింద్
పూలాంగ్ వాగు ఆక్రమణలపై ఎన్ని
ఎఫ్‌ఐఆర్‌లు చేశారని ఇరిగేషన్
అధికారులకు ప్రశ్న
అటవీ భూముల ఆక్రమణల
వ్యవహారంలో అధికారులపై ఆగ్రహం
పర్సంటేజీల చిట్టా ఉంది
పర్సంటేజీల చిట్టా ఉంది
పర్సంటేజీల చిట్టా ఉంది


