విద్యార్థులకు స్కూల్ కిట్
ఖలీల్‌వాడి: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యా ర్థుల మాదిరిగా ప్రభుత్వ విద్యార్థులకూ స్కూల్ బ్యాగ్, టై, బూట్లు, ఐడీ కార్డులు తదితర వస్తువుల ను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రత్యేకంగా ‘స్కూల్ కిట్’ పేరిట వి ద్యార్థులకు అవసరమయ్యే 22 రకాల వస్తువులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందించబోతోంది. మరోవైపు జిల్లాలోని 261 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐతోపాటు కంప్యూటర్ విద్య అందించేందుకు ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించింది. ప్రభు త్వం అందించే కిట్‌తోపాటు కంప్యూటరీకరణ, డిజిటల్ తరగతులు ప్రారంభించనుండటంతో ప్రభు త్వ పాఠశాలలు కార్పొరేట్ హంగులు సంతరించుకోనున్నాయి.
ఒకటి నుంచి పదో తరగతి వరకు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం 22 రకాల వస్తువులతో స్కూల్ కిట్ అందించనుంది. ఈ కిట్‌లో పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, మూడు జతల ఏకరూప దుస్తులు, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్స్, బెల్ట్, టై, ఐడీకార్డు, పెన్సిళ్ల సెట్ తదితర వస్తువులు ఉంటాయి. కిట్‌లు అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతోపాటు తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది.
ఇంటర్‌నెట్ సౌకర్యం
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తున్నది. కానీ, చాలా పాఠశాలల్లో ఇంటర్‌నెట్ సౌకర్యం లేకపోవడంలో ఏఐ బోధన ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 50 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నచోట ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించి ఐదు కంప్యూటర్లను సమకూర్చేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతేడాది డిసెంబర్, ఈ సంవత్సరం జనవరి నెలల్లో జిల్లాలోని 261 ప్రాథమిక పాఠశాలలకు బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించింది. ఈ పాఠశాలలకు రాష్ట్ర విద్యాశాఖ ద్వారా త్వరలో ఐదు కంప్యూటర్లను అందజేయనున్నది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు
22 రకాల వస్తువులు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
జిల్లాలో 261 ప్రాథమిక పాఠశాలలకు ఇంటర్‌నెట్ సౌకర్యం
తల్లిదండ్రులకు తగ్గనున్న ఆర్థికభారం


