భీమ్‌గల్‌ను వీడని సమస్యలు
మోర్తాడ్: మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినా భీమ్‌గల్ పట్టణం పరిస్థితి మాత్రంగా మేడిపండు చందంలా ఉంది. వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులు మూడున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలే దు. భీమ్‌గల్ బస్సుడిపోను 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పునఃప్రారంభించినా బస్సులను, అధికారులను, ఉద్యోగులను కేటాయించకపోవడంతో కాగితాలకే పరిమితమైంది. తహసీల్ భవనాన్ని కూల్చి ఆ స్థలాన్ని మార్కెట్ కోసం కేటాయించారు. అయితే ఆ స్థలంలో మౌలిక వసతులను కల్పించకపోవడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు ఇ బ్బందులు పడుతున్నారు. తహసీల్ కార్యాలయాని కి సొంత భవనం లేక పోవడంతో విద్యార్థి వసతి గృహంలో కార్యాలయం కొనసాగుతోంది. ఇలా ఎ న్నో సమస్యలు భీమ్‌గల్ పట్టణంలో తిష్ట వేశాయి.
నేడు మంత్రి సీతక్క పర్యటన
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క బుధవారం భీమ్‌గల్ పట్టణంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి.. సమస్యల పరిష్కారంపై ఎలా స్పందిస్తారోనని పట్టణ ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. భీమ్‌గల్‌లో రూ.56.50 కోట్ల అభివృద్ధి పనులకు బీజం పడనుంది.
అసంపూర్తిగా ఉన్న వంద పడకల ఆస్పత్రి భవనం
బస్సులు లేని భీమ్‌గల్ బస్సుడిపో
బస్సులు లేని డిపో..
సొంత భవనం లేని తహసీల్
అసంపూర్తిగా ఆస్పత్రి భవనం
మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్
అయినా మారని పరిస్థితి
భీమ్‌గల్‌ను వీడని సమస్యలు


