ఆహారశుద్ధి ఉత్పత్తి యూనిట్లకు ప్రోత్సాహకాలు
సుభాష్‌నగర్: సూక్ష్మ ఆహార శుద్ధి ఉత్పత్తి యూని ట్లు నెలకొల్పేందుకు అసంఘటిత రంగంలో ఉన్న యువతకు, ప్రత్యేకించి స్వయం సహాయక సంఘాల సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయని రాష్ట్ర నోడల్ ఆఫీసర్ నవీన్‌కుమార్ తెలిపారు. ఆహారశుద్ధి రంగాన్ని బ లోపేతం చేయడంపై మెప్మా ఆధ్వర్యంలో ఎస్‌హె చ్‌జీ సభ్యులకు నగరంలోని టీఎల్‌ఎఫ్ భవనంలో మంగళవారం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. మెప్మా సంఘాల పట్టణ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.40 వేల చొప్పున మొత్తం 140 మందికి రూ.56 లక్షల మూలధన రుణం మంజూరైందని పేర్కొన్నారు. మెప్మా సభ్యులు వ్యక్తిగతంగా, సంఘటితంగా అయినా ఆహారశుద్ధి ఉత్పత్తి తయారీ సంస్థల యూనిట్లను నెలకొల్పవచ్చన్నారు. ప్రాజెక్ట్ వ్యయంలో 35 శాతం రాయితీ ఉంటుందని, గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ అందజేస్తారన్నారు. ఈ స్కీమ్‌లో భాగంగా ఉత్పత్తి యూనిట్లు నెలకొల్పేందుకు అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్, సాంకేతిక తోడ్పాటు, రుణ సదుపాయాల కల్పన, ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పూర్తి చేయూతనందిస్తామని పేర్కొన్నారు. వర్క్‌షాప్‌లో మున్సిపల్ టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సీ రమేశ్, పరిశ్రమల శాఖ రిసోర్స్ పర్సన్‌లు రచన, పల్లవి, మెప్మా డీఎంసీ మాధురి, టీఎంసీ శోభారాణి, సీవోలు సంతోష్, అశోక్, ఆర్‌పీలు పాల్గొన్నారు.
గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ
యువత, ఎస్‌హెచ్‌జీ సభ్యులకు
అవకాశం
మెప్మా రాష్ట్ర నోడల్ ఆఫీసర్
నవీన్‌కుమార్ వెల్లడి


